డామిట్ ..కథ అడ్డం తిరిగింది

Publish Date:Jul 4, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు గత కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన వచ్చింది మొదలు, ప్రతి అడుగులో అవరోధాలు,అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల జాతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. జాతీయ పార్టీ, జాతీయ ప్రత్యామ్నియ ప్రణాళిక ఆలోచనలు ఎక్కడవేసిన గొంగళి  అక్కడే అన్నట్లు ఫార్మ్ హౌస్  గడప దాట లేదు.

మరోవంక  వరితో మొదలైన కేంద్రం పై యుద్ధం ఆశించిన ఫలితం సాధించలేక పోయింది.  ఇక ఇప్పడు తాజాగా, రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం జరిగిన మరు క్షణం నుంచి, కేసీఆర్, కేటీఆర్ బీజేపీని  బద్నాం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతూ వచ్చారు. అయితే చివరాఖరుకు, కథ అడ్డం తిరిగింది. బీజేపీని, ప్రధాని మోడీని బద్నాం చేసేందుకు, ఫ్లెక్సీల యుద్ధం చేసినా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్బ్యర్ది యశ్వంత్ సిన్హా తీసుకొచ్చి హడావిడి చేసినా, అదే అదనుగా ప్రధాని మోడీ పై  ‘’సేల్స్ మ్యాన్’ వంటి విమర్శలు చేసినా, జాతీయ, అంతర్జాతీయ విషయాలు అన్నింటినీ కలబోసి ప్రశ్నలు సంధించినా, చివరకు, వృధా ప్రయాసే మిగిలిందని, తెరాస నేతలే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం ఇస్తారని ఆశించారు. ఆయనకు ఆయనే, ముందుగానే మోడీ, తనను టార్గెట్  చేస్తారని ప్రకటించుకున్నారు. అయితే, కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా, ఏర్పాటు చసిన విజయ సంకల్ప సభలో,ప్రధాని మోడీ 30 నిముషాలకు పైగా చేసిన ప్రసంగంలో కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అసలు కేసేఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో ఏమి చేసిందో, ముందు ముందు ఏమి చేస్తుందో, నేరుగా ప్రజలకే చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని తేల్చేశారు. దీంతో కేసేఆర్ కు మోడీనుంచి తిట్లదండకం  ఆశించిన తెరాస నేతలకు మరో మారు ఆశాభంగం ఎదురైంది. ముఖ్యమత్రి కేసీఆర్  ప్రశ్నలకు సమధానం చెప్పక పోగా అసలు, ఆయన ప్రస్తావనే చేయక పోవడం, ప్రధాని మోడి, ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ను  పూచిక పుల్లకంటే హీనంగా పక్కన పెట్టడం, అవమానంగా భావిస్తున్నారు.

సరే, అంత మాత్రం చేత, తెరాస ఇక  చేతులు ముడుచుకుని కుర్చుంటుందని  కాదు.  కానీ, కేంద్రంపై యుద్ధం పేరుతో బీజేపీని టార్గెట్ చేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేయక తప్పదని, ఎదంటే అది అనేస్తే కుదరదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే విధంగా  తెరాస ఎన్నికల వ్యూహాన్ని సవరించుకోవలసి ఉంటుదని అంటున్నారు. 
అదలా ఉంటే విజయసంకల్ప సభ  ఎవరూ ఉహించని విధంగా సక్సెస్ అయింది. నిజానికి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం బహిరంగ సభ ఏర్పాటు ప్రతిపాదన చేసినప్పుడు, పార్టీ జాతీయ నాయకత్వం తటపటాయించింది, సక్సెస్ కాకపోతే, అభాసు పాలవుతామని, ఒకటికి పదిసార్లు అలోచించి, సమాలోచనలు జరిపి చివరకు ఓకే చెప్పింది. అయినా, వ్యూహాత్మకంగా, ఉభయతారకంగా, రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు, కేంద్ర మంత్రులు, వివిదః రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర కీలక నేతలను ఇంచార్జిలుగా నియమించి, మూడు నాలుగు రోజుల ముందునుంచి జనసంపర్క యాత్రలు నిర్వహించింది. ఆ విధంగా సభ సక్సెస్ కావడమే కాకుండా, రాష్ట్రం’ పై బీజేపీ ఫోకస్ ఎంత బలంగా  వుందో, జతేఅయ్ స్థాయిలో  బీజేపీ శక్తీ సామర్ధ్యాలు ఏమిటో  చెప్పకనే చెప్పినట్లయింది.అంతే కాదు, కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి ప్రసంగించిన మోడీ, ఇది వన్ టైం ఎఫైర్ కాదు, ఈ దండ యాత్ర ఇలా కొనసాగుతూనే ఉండాలని సూచించారు. సో.. ఇలాంటి యాత్రలు, దండయాత్రలు ఇలా కొనసాగుతూనే  ఉంటాయి, అనే సంకేతం అయితే వచ్చింది. 

ఓవరాల్’’గా చూస్తే, బీజేపీ, తెరాసల మధ్య సాగుతున్న వ్యూహాత్మక యుద్దంలో ప్రస్తుతానికి అయితే బీజేపీ పై చేయి సాధించింది. అయితే, ఇక్కడితో కథ ముగిసినట్లు కాదని, వ్యూహాలు మార్చుకునేందుకు తెరాసకు ఇంకా సమయం ఉందని, పరిశీలకులు అంటున్నారు. అయితే, కేంద్రంపై యుద్ధం విషయంలో ఇప్పటికే చాలా దూరం వెళ్ళిన కేసీఆర్, వెనకడుగు వేస్తారా,  అంటే రాజకీయ పరిశీలకులు మాత్రం అనుమానమే అంటున్నారు.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.