మునుగోడుకు ముందే ముందస్తు.. కేసీఆర్ వ్యూహమిదేనా?

Publish Date:Sep 21, 2022

Advertisement

 తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాజకీయ విజ్ఞత, వివేచన విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమనాలు అక్కరలేదు. సమయానుకూలంగా స్ట్రాటజీలను మార్చడంలో ఆయన దిట్ట. అందులో సందేహం లేదు. అయితే, కారు జోరు రివర్స్ లో పరుగులు తీస్తున్న ప్రస్తుత సమయంలో కేసీఆర్ అడుగులు తడబడుతున్నాయి. జాతీయ స్థాయిలో జెండా ఎగరేసే విషయంలో అయితే నేమి, రాష్ట్రంలో రోజు రోజుకు పైకి పాకుతున్న ప్రభత్వ వ్యతిరేకతను కట్టడి చేసే విషయంలో అయితే నేమి కేసేఆర్ వ్యూహాలు గతంలో పనిచేసినంత చురుగ్గా పనిచేయడం లేదు. జాతీయ రాజకీయాలకు ఒక బ్రేక్ ఇచ్చి, రాష్ట్రం  మీద దృష్టిని కేంద్రీకరించారు.

కేంద్ర ప్రభుత్వం ,బీజేపీపై యుద్ధాన్ని కొనాసగిస్తునే, రాష్ట్రంలో కరిగి పౌతున్న ఓటు బ్యాంకు కాపాడు కునేందుకు కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. కొత్త పథకాలతో కొత్త కొత్త ఎత్తులతో, పోగుట్టుకున్న ప్రతిష్టను, నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజనుల రిజర్వేషన్ ను ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నట్ల ప్రకటించారు. అది కూడా ఎప్పుడో కాదు, జస్ట్ ఒక వారం రోజుల్లోనే జీవో వస్తుందని తెలంగాణ విమోచన దినం ( సెప్టెంబర్ 17) రోజున ప్రకటించారు. అంతేకాదు,  తెలంగాణ ఏర్పాటయ్యాక గిరిజనుల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా.. ఇప్పటికీ స్పందన లేదని విమర్శించారు.

కేంద్రానికి మొరపెట్టుకొని.. విసిగిపోయామని..ఇక ఓపిక లేదని.. వారం రోజుల్లోనే రిజర్వేషన్ల జీవోను జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ జీవోను గౌరవించి అమలు చేస్తావా? లేదంటే దానిని ఉరి తాడు చేసుకుంటావా? అని ప్రధాని నరేంద్రమోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటన విషయంలో, ఎవరికుండే అనుమానాలు వారికున్నాయి. ముఖ్యంగా, ఎస్సీలు, ఇతర వెనకబడిన కులాలు, గిరిజనుల రిజర్వేషన్ పెరిగితే, మొత్తం రిజర్వేషనలు, సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిధ్జిని దాటి పోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే ముఖ్యంత్రి, అధికార పార్టీ నాయకులు  మాత్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను అనుమతించిన సుప్రీం కోర్టు, తెలంగాణలో ఎందుకు అనుమతించదని ప్రశ్నిస్తున్నారు. అయితే, గతంలో ఇదే వ్యూహంతో అడుగులు వేసిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బొక్కబోర్లా పడ్డాయని, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.  

తాజాగా, ఛత్తీస్ సగఢ్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ పదేళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ పి.పి.సాహూల ధర్మాసనం రెండు రోజుల క్రితం (సోమవారం) తీర్పు వెలువరించింది. 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను పెంచడం సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యంపై ఎలాంటి అధ్యయనం కూడా చేయలేదని పేర్కొంది. ఛ త్తీస్ గఢ్‌ ప్రభుత్వం కూడా తమిళనాడు ఉదాహరణను ఉతకిస్తూ తెలంగాణ ప్రభుత్వ చేసిన వాదనే చేసింది.అయినా,  న్యాయస్థానం పెంపు చెల్లదని తీర్పునిచ్చింది.

ఈ నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎంతవరకు న్యాయ విచారణకు  నిలుస్తుందనే విషయంలో సందేహాలున్నాయి. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక గిరిజనులకు మేలు చేయాలనే సంక్సల్పం కంటే, పార్టీ, కుటుంబ సభ్యలను కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు నుంచి కాపాడుకునే కాపాడుకునే సంకల్పమే బలంగా పనిచేస్తోందని, అంటున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి, అక్కడితోనూ ఆగలేదు. హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రకటించిన దళిత  బంధు తరహాలో, గిరిజన బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి గిరిజన కుటుంబానికి రూ.10 లక్షలు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలో దళిత బంధుతో పాటుగా ఇంకా అనేక ప్రయోజనాలు వెదజల్లినా తెరాస అభ్యర్థి ఓడిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి  ఉద్దేశపూర్వకంగా మరిచి పోతున్నారని అంటున్నారు. 

ఆదలా ఉంటే, గిరిజనులకు ఈ జంట వరాలను ప్రసాదించడం వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అలోచన చేస్తున్నారా, అనే సదేహలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా, ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. అది ఆందోళనల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత  ప్రతిష్టాత్మకం, పారదర్శకం అటూ తెచ్చిన ధరణి పోర్టల్ దగాకు మోసపోయిన నలుగురు రైతులు ఒకే రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేశారంటే, ఒక్క ధరణి ఎకౌంటులో ప్రభుత్వ ప్రతిష్ట ఎంతగా దిగజారిందో, ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయికి చేరిందో, వేరే చెప్పనవసరం లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చకక్దిద్దుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.  నిజానికి, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు కాదు, తెరాస రెండవసారి, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.86 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెరాస, సంవత్సరం తిరగకుండా 2019 లోక్ సభ ఎన్నికల నాటికే, 41.29 శాతం ఓట్లతో తొమ్మిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంది.

అంటే సంవత్సర కాలంలోనే ఐదు శాతం ఓటు కోల్పోయింది . మరో వంక  అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 7.1 శాతం ఓటుతో, ఒకే ఒక్క స్థానం గెలుచుకున్నబీజేపీ, లోక్ సభ ఎన్నికలలో 19.45 శాతం ఓటుతో, 4 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. అంటే ఒకే ఒక్క సంవత్సరంలో బీజేపీ ఓటు షేర్ 12 శాతం పెరిగింది.   ఆతర్వాత జరిగిన దుబ్బాక, హుజురా బాద్ ఉపఎన్నికలు, జీహెచ్ఎంసి ఎన్నికలు బీజేపీ లో జోష్ ను పెంచాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తారుమారైతే, ఇక ఆతర్వాత ఏ బంధు ప్రకటించినా ఫలితం ఉందని ముఖ్యమంత్రి గమనించారు. అందుకే, మునుగోదుకు ముందే ముందస్తు ఎన్నికలకు పోవడం మంచిదనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకే, మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే విషయంలోనూ ముఖ్యమంత్రి వెనకా ముందు అవుతున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.