ఆలూ లేదు చూలూ లేదు.. అయినా హామీలకు కొదవే లేదు

Publish Date:Sep 16, 2022

Advertisement

ఏ దేశానికీ అయినా ఒకరే ప్రధాని ఉంటారు.. ఒకటే రాజధాని ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రానికి అయిన ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు. ఒకటే రాజధాని ఉంటుంది. అంతే కానీ, ఏకకాలంలో ఇద్దరు, ముగ్గురు ప్రధానులు ఉన్న దేశం, ఇద్దరు ముగ్గరు ముఖ్యమంత్రులు ఉన్నరాష్ట్రం ఉండవు. అలాగే ఏక కాలంలో రెండు మూడు రాజధానులు ఉన్న దేశాలు రాష్ట్రాలు కూడా ఉండవు. అయితే,ఇప్పడు దేశంలో ఇద్దరు,ముగ్గురు కాదు ఏకంగా ఓ అరడజను మందికి పైగానే, మహా నాయకులు ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. నిజమే,ప్రధాని పదవికి  పోటీ పడడం వరకు అయితే తప్పు కాదు. అందులో అక్షేపించవలసిన విషయం ఉండదు. కానీ, ఒక కూటమిగా కలిసి పోటీచేయాలని అనుకుంటున్న పార్టీల నాయకులు ఎవరికి వారు, ‘నేనే ప్రధాని’ అన్న విధంగా వాగ్దానాలు చేయడం వరకు వచ్చేశారు. అక్కడే చిక్కొచ్చింది.

ఇతర నేతల విషయం ఎలా ఉన్నా  తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ ఇద్దరికిద్దరూ ఏమి కలలు కంటున్నారో ఏమో కానీ, పోటాపోటీగా వాగ్దానాలు చేసేస్తున్నారు. అయితే, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుగా ఎవరికి వారు ఇలా  ప్రధాని కిరీటం పెట్టేసుకుంటే, అసలుకే మోసం చేసేవిధంగా ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. 
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు విషయాన్నే తీసుకుంటే  2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చేది, ‘మన’ ప్రభుత్వమే అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. పార్టీ వేదికలనుంచే కాదు, పబ్లిక్ మీటింగులలో అదే ధీమా వ్యక్త పరుస్తున్నారు. అయితే ఆ ‘మనం’ లో ఎవరెవరు ఉన్నారో, ఎవరు లేరో మనకు తెలియదు, కానీ, ఆయన మాత్రం తెరాస శ్రేణులను ఉద్దేశించే ఈ ప్రకటన చేశారు. అంటే, తెరాస లేదంటే ఇంకా పుట్టని జాతీయ పార్టీ, బీఆర్ఎస్ అధికరంలోకి వస్తుందనేది ఆయన ఆలోచనో ఏమో, కానీ, ఉచిత వరాల జల్లు అయితే మొదలైంది. కేంద్రంలో, ‘మన’ ప్రభుత్వం రాగానే, దేశంలోని రైతులు అందరికీ, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా ఇత్యాది ఉచితాలన్నీ ఇచ్చేస్తామని ప్రకటించారు.

అంతే కాదు, దేశం మొత్తంలో తెలంగాణ మోడల్ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.అంటే రాబోయే రోజుల్లో కాబోయే ప్రదాని తానే నని చెప్పకనే చెప్పారు. అయితే, ఇంతవరకు  జాతీయ రాజకీయాలో ఆయన పోషించే పాత్రపై ఆయన సంగతి ఏమో కానీ, తెరాస శ్రేణులు సహా ఏ ఒక్కరికీ ఎలాంటి స్పష్టత లేదు. జాతీయ పార్టీ పెడతారా, ప్రాతీయ పార్టీల జాతీయ కూటమిని ఏర్పాటు చేస్తారా లేక నలుగురిలో  నారాయణ గుంపులో గోవింద అన్నట్లుగా, జాతీయ పార్టీల ప్రాంతీయ కూటమిలో చేరతారా? ఏమి చేస్తారు? ఎటు పోతారు ? జాతీయ రాజకీయాల్లో అయన పోషించే పాత్ర ఏమిటి? ఇలా జవాబు లేని ప్రశ్నలు, ఎన్నో.. అయినా, ఆలు లేదు చూలు లేదు , కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుగా, కేసీఆర్  జాతీయ నేతగా ప్రచారం చేసుకుంటున్నారు.పట్టుమని పది మంది ఎంపీలు లేక పోయినా, తానే కాబోయే ప్రధాని అనే ధీమాతో, దేశ ప్రజలపై వరాల జల్లు కురిపితున్నారు. 

కేసీఆర్ కథ ఇలా ఉంటే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్’ కుమార్, మరో అడుగులు ముందుకేశారు. 2024 ఎన్నికల్లో పీఎం కుర్చీలో కూర్చోగానే,బీహార్‌తో సహా వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా కల్పిస్తామని వాగ్దానం చేశారు. అంతే కాదు, కేసీఆర్ కంటే ఇంకా ఎక్కవ భరోసాతో, వెనక బడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వక పోవడానికి ప్రత్యేక కారణం ఏదీ లేదని కూడా నితీష్ కుమార్ సెలవిచ్చారు. 

అయితే, నిజానికి, నితీష్ కుమార్ ఇటీవల ఢిల్లీలో గడప గడపకు వెళ్లి దండాలు పెట్టుకుని వచ్చిన సందర్భంలో, అన్ని పార్టీల నాయకులను కలిసిన సమయంలో, తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు. బీజేపే యేతర పార్టీలను ఏకం చేసి, మోడీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కానీ, ఇప్పడు ఏకంగా, ఏక పక్షంగా, కీలక వెనకబడిన రాష్ట్రాలకు  చేశారు. అంటే ఒక విధంగా తానే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధినని డిక్లేర్ చేశారు.

ఇలా ఓ వంక కేసీఆర్, మరో వంక నితీష్, ఈ పక్క నుంచి మమతా బెనర్జీ, ఆ వైపు నుంచి కేజ్రీవాల్, ఇటు పవార్, అటు మాయ ఈ అందరినీ మించి, పార్టీని పణంగా పెట్టి మరీ భారత్ జోడో యాత్రా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. ఇలా ఎవరికీ వారు ఎవరి ఎజెండాతో వారు ముందుకు పోతున్నారు. అందుకే రాజకీయ పండితులు ప్రతిపక్షలా ఈ అనైక్యతే బీజేపీకి శ్రీరామ రక్షా.. అంటున్నారు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.