చాలా రోజుల తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు విప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తనదైన స్టైల్లో విమర్శల వర్షం కురిపించారు. పనిలో పనిగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినందుకు జనం ఇప్పుడు బాధపడుతున్నారని కూడా అన్నారు. అయితే ఇదంతా కూడా తెలంగాణ భవన్ కు వచ్చో, ఏదో బహిరంగ సభలోనో చేసిన ప్రసంగం కాదు. తన తన ఫామ్ హౌస్ లో కూర్చునే చేసిన ఉపదేశం.
ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరంగల్ జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఈ నెల 24న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై వరంగల్ జిల్లా పార్టీ నేతలకు సూచలను ఇచ్చారు. సభకు పెద్ద ఎత్తు జనం స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పిన కేసీఆర్.. ఆ వచ్చే జనాలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు మనో ధైర్యాన్ని ఇచ్చే విధంగా రజతోత్సవ సభ ఉండాలని అన్నారు. ఈ సభ తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీలు వేస్తానన్న కేసీఆర్.. పార్టీ క్యాడర్ కు, నేతలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో రేవంత్ నియంత పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకుని కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయన్నారు.
తెలంగాణ రైతులకు ఈ దుస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని విధాలుగా దగాపడి మనో ధైర్యాన్ని కోల్పోయిన రైతులు, వివిధ వర్గాల ప్రజలలో ధైర్యం నింపే విధంగా రజతోత్సవ సభ నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ నేతలు బుధవారం (ఏప్రిల్ 2) ఎల్కతుర్తిలోని సభా ప్రాంగణానికి భూమి పూజ నిర్వహించారు. కేసీఆర్ రజతోత్సవ సభకు సంబంధించి నేతలకు చేసిన దిశా నిర్దేశంతో.. రజతోత్సవ సభ వేదిక వరంగల్ నుంచి మేడ్చల్ కు మారుతుందన్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-gives-directions-to-brs-rajatostsava-sabha-39-195476.html
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.