Publish Date:Nov 10, 2024
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారు నడిపారు. ఔను తన ఫామ్ హౌస్ లో బెంజ్ కారు నడిపి అందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారు. మీడియాకే కాదు, పార్టీ నేతలకు, శ్రేణులకూ కూడా అందుబాటులో లేకుండా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
దీంతో పార్టీ శ్రేణులలో తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, నేతలూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆందోళనలలు చేపడుతున్నప్పటికీ, అవి పెద్దగా ప్రభావమంతంగా లేవు. కేసీఆర్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనక పోవడం, అసలు రాజకీయాలను వదిలేశారా అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో వచ్చే ఏడాది జనవరి నుంచీ తాను పార్టీ వ్యవహారాలను సీరియస్ గా పట్టించుకుంటాననీ, రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరిస్తాననీ ప్రకటించారు. ప్రజలకు ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య తేడా స్పష్టంగా తెలిసిందన్నారు. రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇద్దామన్న ఉద్దేశంతోనే ఇంత కాలం మౌనంగా ఉన్నానని చెప్పిన కేసీఆర్.. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాననీ చెప్పారు. దీంతో క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.
అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ అన్నట్లుగా వచ్చే ఏడాది జనవరిని నుంచీ క్రీయాశీలంగా ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పరాజయం తరువాత ఆయన ఒకే ఒక రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అదీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు. ఆ రోజు రేవంత్ సర్కార్ బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. ఆ తరువాత సైలెంటైపోయారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు ఇలా ఏ కీలక అంశంపైనా ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ క్రియాశీలం అవునానని ప్రకటించినా పార్టీ నేతలలో కొందరికి నమ్మకం కుదరడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఫామ్ హౌస్ లో కారు నడిపారు. తద్వారా గ్యారేజీలోంచి కారును బయటకు తీసుకువస్తాననీ, ఇక కారు స్పీడ్ తో కాంగ్రెస్ సర్కార్ బెంబేలెత్తిపోవడం ఖాయమనీ సంకేతాలిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైగర్ ఈజ్ బ్యాక్ బీఆర్ఎస్ శ్రేణులు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కారు జోరును అడ్డుకోవడం రేవంత్ వల్ల కాదని వ్యాఖ్యలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-drives-car-in-farmhouse-25-188171.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.