తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తమ గొప్పలు చెప్పుకోవాలంటే ఏపీలో నెలకొన్న అధ్వాన పరిస్థితులను ప్రస్తావించడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఆ పనిని ఇప్పటి వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే చేశారు. ఇప్పుడు ఏపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ద్వారా కేసీఆర్ కూడా గీత దాటేశారు. ఏపీలో పరిస్థితులు అద్వానంగా ఉన్నాయని ఏకంగా బహిరంగ సభలో చెప్పేశారు. పొరుగు రాష్ట్రం గురించి, ఆ రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఏకంగా ముఖ్యమంత్రే చెప్పారంటే ఏపీ పరువు ఏ గంగలో కలిసినట్లో ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇవ్వాలి.
ఔను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీలో చిమ్మ చీకట్లు నెలకొన్నాయని బహిరంగ సభ వేదికగా చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ వెలుగుజిలుగులతో విరాజిల్లుతుంటే.. ఏపీ మాత్రం చిమ్మ చీకట్లో మగ్గిపోతోందని అన్నారు. ఈ మాట ఏదో ఇష్టాగోష్టిగా తమ పార్టీ నాయకులతోనో, మంత్రివర్గ సహచరులతోనో మాట్లాడుతూ కాదు.. ఒక బహిరంగ సభా వేదిక మీద నుంచి చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఏపీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆగ్రహం ఏపీ వాసుల నుంచి వ్యక్తం కావడం లేదు. ఆయన చెప్పింది వాస్తవమే కదా అన్న వ్యాఖ్యలే జనం నుంచి వినవస్తున్నాయి. గతంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఏపీలో విద్యుత్ పరిస్థితి గురించి, రోడ్ల దుస్థితి గురించి ఏకంగా ఇన్వెస్టర్ల సదస్సులోనే విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఐదేళ్ల పాటు ప్రతి అంశంలోనూ, ప్రతి విషయంలోనూ తెలంగాణను అధిగమించిన ఏపీ.. ఆ తరువాత ఇలా అన్ని రంగాలలోనూ వెనుకబడిపోవడానికీ, పొరుగు రాష్ట్రం నేతలు ఏపీ పరిస్థితుల గురించి చులకనగా వ్యాఖ్యలు చేసినా ఏపీ సర్కార్ ఖండించలేని దుస్థితిలో ఉండడానికీ కారణమేమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ నిర్విరామంగా అందుతుంటే.. ఏపీలో మాత్రం అడ్డగోలు కోతలతో జనం ఆగమాగం అయిపోతున్నారు. జూన్ మొదటి వారం గడిచిపోయినా ఎండల తీవ్రత ఇసుమంతైనా తగ్గకపోవడం, డిమాండ్ కు సరపడా విద్యుత్ సరఫరా చేయలేక ఏపీ చేతులెత్తేయడాన్ని కేసీఆర్ ఎత్తి చూపారు తప్పేముందని ఏపీ జనమే అంటున్నారు. అయితే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో అద్వాన పరిస్థితుల గురించి ప్రస్తావించడం ఇదే మొదటి సారి కాదు. అలాగే తెలంగాణ, ఏపీ మధ్య పాలన సామర్ధ్యంలో తేడాల గురించి చెప్పడంలో మంత్రలు కేటీఆర్, హరష్ రావు కీలకమైన పెట్టుబడులు ఇతర సమావేశాల్లో ప్రస్తావించి ఏపీలో ఏపీలో అన్ని రకాల పరిస్థితుల్ని చూపించి భూతల నరకం అంటే ఏపీయే అని చెబుతున్నారు. ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఖండించే ధైర్యం కూడా లేకుండా పోయింది. మొదటి సారి కేటీఆర్ ఏపీలో అద్వాన పరిస్థితుల గురించి విమర్శించిన సందర్భంగా ఏపీలో కొంత మంది మంత్రులు నామ్ కే వాస్తే ఖండించి ఆ తరువాత సైలంట్ అయిపోయారు. జగన్ కేసీఆర్ మధ్య కొనసాగుతున్న స్నేహ బంధమే ఏపీ మంత్రుల సైలెన్స్ కు కారణమని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. కానీ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ పాలనలో ఏపీ అధ్వానంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నా.. ఏపీ సీఎం జగన్ కానీ, మంత్రులు కానీ నోరెత్తకపోవడాన్ని కూడా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాలే కారణమని ఎవరైనా ఎలా సరిపెట్టుకోగలరు?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-comments-on-ap-39-156458.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.