కేసీఆర్ రీతి, నీతి.. నిన్నటికి నేడు కొత్త.. నేటికి రేపు కొత్త

Publish Date:Aug 2, 2023

Advertisement

కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నిన్న రైట్ అన్నది రేపు రాంగ్ అవుతుంది.. ఇవ్వాల రాంగ్ అన్నది రేపు రైట్ అవుతుంది అని. అయితే తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం  ఎప్పుడు ఏది రైట్ అంటారో.. ఎప్పుడు ఏది రాంగ్  అంటారో ఆయనకైనా తెలుసా అన్న అనుమానం కలగక మానదు. ఒకే విషయంపై వేర్వేరు సందర్భాలలో ఆయన వేర్వేరు భాష్యాలు చెబుతారు. జనానికి ఏదీ గుర్తు ఉండదన్న విశ్వాసమో.. లేక ఆయనకే ఏం మాట్లాడానన్నది గుర్తుండదా అన్నది తెరాస శ్రేణులకే అర్ధం కాని విషయం. తెలంగాణ ఆవిర్భావానికి ముందు దళిత ముఖ్యమంత్రి అన్న ఆయనే.. తీరా తెలంగాణ ఆవిర్భవించి.. తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్) విజయం సాధించిన తరువాత మాట మార్చారు. కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే సమర్ధుడి నాయకత్వం అవసరమంటూ తానే సీఎం పగ్గాలు అందుకున్నారు. అలా అందుకున్న తరువాత గత తొమ్మిదేళ్లుగా ఆయనే అధికార పగ్గాలను చేతబట్టారు. దళిత ముఖ్యమంత్రి అని తన నోటి వెంటే వచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయారు. తన తరువాత రాష్ట్ర పగ్గాలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి అప్పగించడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు. ఇక ఆ తరువాత ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి అన్నది కూడా అలాగే  అయ్యింది. మచ్చుకు ఇవి రెండు మాత్రమే ప్రస్తావించినా.. ఆయన ఔనన్నది కాదని.. కాదన్నది ఔనన్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం. ఇది నిజంగా ఉభయ తెలుగు రాష్ట్రాలనూ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.   ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ నిన్న మొన్నటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది.  అయితే ఏపీలో జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత తెలంగాణలో కూడా అలాగే చేయాలన్న డిమాండ్ బలంగా తెరపైకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ దానిని కొట్టి పారేశారు. ఆంధ్రలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ చేసిన ప్రయోగం విఫలమౌతుందని అప్పట్లో జోస్యం చెప్పారు. బుర్రా బుద్ధీ ఉన్నవారెవరూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయరనీ, అది జరిగే పని కాదనీ తేల్చేశారు. ఆ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించి మరీ అది సరైనది కాదని చెప్పారు. తెలివితక్కువ నిర్ణయం అని తేల్చేశారు. అయితే ఇప్పుడు ఎవరూ అడగకుండానే స్వయంగా కేసీఆర్ ఆ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుని, తాను తీసుకున్న నిర్ణయం చాలా చాలా గొప్పదంటూ తన భుజాలను తానే చరుచుకుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమన్నది భూగోళం ఉన్నంత వరకూ జరిగేది కాదన్న నోటితోనే ఆయన విలీన ప్రకటన చేశారు. విధివిధానాల ఖరారుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేబినెట్ లో ఆర్టీసీ విలీనం నిర్ణయం తరువాత నాడు ఏపీలో ఆర్టీసీ విలీనం తరువాత కేసీఆర్ మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలివితక్కువ నిర్ణయాలను అడాప్ట్ చేసుకోవడంలో కేసీఆర్ అంతటివాడు లేడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదన్న విశ్లేషణల నేపథ్యంలో కేసీఆర్ వీఆర్ఏలకు, ఆర్టీసీ కార్మికులకు వరాలు కురిపించడం చాణక్యమేనని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలి ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ అని వాగ్దానం చేసిన ఆయన ఇన్నేళ్లుగా మొండి చేయి చూపుతూనే వస్తున్నారు.  మాట ఇవ్వడం.. మాట తప్పడం, హామీలను గాలికి వదిలేయడం కేసీఆర్ కు కొత్తేమీ కాదని అంటున్నారు. ఎన్నికలు ముంచుకువస్తున్నాయి కనుక విలీనం అంటూ చేసిన ప్రకటన ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందన్న భావనతోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారనీ, అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల బకాయిలు, ఇతర ఆర్థిక అంశాల గురించి కేబినెట్ లో కనీస ప్రస్తావన కూడా చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్పటికెయ్యది
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.

అన్న సుమతీ శతకంలోని శ్లోకాన్ని కేసీఆర్ తు.చ. తప్పకుండా పాటిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.