కేసీఆర్ మన మనిషి కాదు మరమనిషి.. గుంటనక్కల చేతిలో బందీ.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Publish Date:Apr 25, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత,  కేసీఆర్ కుమార్తె,  కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌) పేరుతో తన పార్టీని ప్రకటించిన కవిత ఆ సందర్భంగా  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో  పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు.  గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే..   ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. 

ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కేసీఆర్ లక్ష్యంగా గుప్పించిన విమర్శలు సంచలనంగా మారియి.   రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదనీ, ఆయనకు  అధికారం ముందు మమకారం తగ్గిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను హెచ్చరించినా, తనను పక్కనపెట్టి  పందికొక్కులను అందలం ఎక్కించారని విమర్శలు గుప్పించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచి పని చేశారన్న కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు   రాష్ట్రం కోసం తాను స్వేచ్ఛగా పోరాడతానన్నారు.  సామాజిక తెలంగాణ సాధనే తమ పార్టీ లక్ష్యమని  ప్రకటించిన కవిత..   రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనీ, తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుతాననీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత పాంచజన్యం పేరిట ఐదు హామీలు ఇచ్చారు.  

ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ హామీలు ప్రకటిస్తున్నట్లు చెప్పిన కవిత..   ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందించే విధానాన్ని అమలు చేస్తామంటూ మొదటి హామీనీ..  అదేవిధంగా ప్రజలకు  ఏ రోగమొచ్చినా, ఏ దవాఖానాలో అయినా ఉచిత చికిత్స అందిస్తామని రెండో హామీని ప్రకటించారు. ఇక  వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి  రైతే రాజు  అనే నినాదాన్ని నిజం చేస్తామంటూ మూడో హామీనీ,  అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నాలుగో హామీనీ ప్రకటించారు.   తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సిందేననీ, సామాజిక న్యాయం సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామంటూ ఐదో హామీ ఇచ్చారు. 
 

By
en-us Political News

  
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.