కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్?

Publish Date:May 8, 2026

Advertisement

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ముఖ్యమంత్రి రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయనకు పట్టాభిషేకం చేసేందుకు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో..  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై   కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.

గత కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వేణుగోపాల్.. ఇప్పుడు తిరిగి సొంత రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని క్లిష్ట సమయాల్లో సమన్వయం చేయడంలో ఆయన చూపిన చొరవను అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను కేరళ సీఎంగా పంపేందుకు ఏఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్రస్థాయిలో మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వి.డి. సతీశన్ వంటి నేతలు రేసులో ఉన్నారు.  అయితే  , పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.  దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్ కు మద్దతు తెలిపారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. 

గతంలో ఉమెన్ చాందీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం వేణుగోపాల్‌కు ఉంది. అప్పట్లోనే ఆయన తనదైన శైలిలో పాలన సాగించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో, కేరళ అభివృద్ధికి ఆయన నాయకత్వం అవసరమని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు, అధికార ఎల్డీఎఫ్ పరాజయానికి ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నేత బాధ్యతలు చేపడితే రాష్ట్ర ప్రయోజనాలకు మేలు జరుగుతుందని మద్దతుదారులు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం పరిశీలకులను కేరళకు పంపింది.ఏఐసీసీ పరిశీలకులుగా    అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.  ఎమ్మెల్యేల అభిప్రాయాలు స్వీకరించి, ఆ నివేదికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు శుక్రవారం ( మే8) అందజేశారు.   

By
en-us Political News

  
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.