తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీలలో భాగంగా రేవంత్ సర్కార్ అమలు చేసిన తొలి హామీ కూడా ఇదే. అంతకు మందే కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడానికి ఆ హామీ ఎంతో దోహదపడింది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలు బ్రెయిన్ చైల్డ్ గా ఈ పథకాన్ని చెబుతారు. కర్నాటక ఫలితాన్ని చూసిన తరువాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మహిళలకు టీజీఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కాగా గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కానుగోలే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నెరవేర్చింది.
అయితే కర్నాటకలోకి సిద్దరామయ్య సర్కార్ తమ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని రద్దు చేసే యోచనలో ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ పథకంపై సమీక్షించి కొనసాగించే విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని ప్రకటించడమే. ఈ పథకం వల్ల ఆర్టీసీ మీదే కాకుండా రాష్ట్ర ఖజానా మీద కూడా మోయలేని భారం పడుతోందన్నారు. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కంటే టికెట్లు కొనుక్కుని ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారని, అందుకే ఈ పథకాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నామనీ డీకే శివకుమార్ వివరించారు.
ఇక మళ్లీ తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందనీ, దీంతో టికెట్లు కొనుక్కుని బస్సులో ప్రయాణం చేసే వారికి సీట్లు దొరకడం సంగతి అటుంచి కనీసం కాలు పెట్టేందుకు కూడా అవకాశం లేని పరిస్థితులు ఎదురయ్యాయని అంటున్నారు. అయితే ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కర్నాట సర్కార్ తమ రాష్ట్రంలో ఈ పథకం రద్దు చేసే యోచనలో ఉండటంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా ఈ పథకం కొనసాగింపుపై పునరాలోచన చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karnataka-goodbye-to-free-bus-travel-scheme-for-women-39-187702.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.