వైసీపీ ‘కాపు’రంలో మిగిలేది ముగ్గురేనా?

Publish Date:Sep 18, 2024

Advertisement

వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ కు రాష్ట్రంలో గాలి ఆడటం లేదు.  ఇంత కాలం వైసీపీకి ‘కాపు’ కాసిన నేతలు కూడా దూరం జరుగుతున్నారు. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీని వీడుతున్నారు.  అలాంటి వారిలో ఇంత కాలం జగన్ కు సన్నిహితంగా ఉన్న వారే ముందుగా బయటకు వస్తుండటం విశేషం.

ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని, గుంటూరు జిల్లా కు చెందిన కిలారు వెంకటరోశయ్యలు, జగన్ కు, వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇరువురూ కూడా వారి వారి నియోజకవర్గాలలో బలమైన నేతలే. ఇరువురూ కూడా జగన్ కు సన్నిహితులుగా ముద్రపడిన వారే. అయితే ఎన్నికల ఫలితాల తరువాత కొంత కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వీరు.. ఆ తరువాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ సందర్భంగా వారు జగన్ తీరు పట్ల కొన్ని సునిశిత వ్యాఖ్యలు కూడా చేశారు.

ఇప్పుడు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయభాను పార్టీని వీడేందుకు రెడీ అయిపోయారు. ఉదయభాను వైఎస్సార్ హయాం నుంచి ఆయనకు, ఆయన తరువాత జగన్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆయన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక సారి కాంగ్రెస్ నుంచి, ఆ తరువాత రెండో సారి  వైసీపీ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడిన సామినేని ఉదయభాను అప్పటి నుంచి జగన్ పట్ల, వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తిగానే ఉన్నారు.  అయితే జగన్ సామినేని ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. అదేమిటంటే జనసేనానిని పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేయాలని, అయితే అందుకు సామినేని ఉదయభాను అంగీకరించలేదు. దాంతో జగన్ ఆయనను దూరం పెట్టారు.  పవన్ పై ఇష్టారీతిన విమర్శలు, వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోవడానికి రెడీ అయిన పేర్నినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారికి ప్రాధాన్యత ఇచ్చారు. 

ఇప్పుడు సామినేని ఉదయభాను జనసేన గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే సామినేని ఉదయభాను జనసేన నాయకుడు నాగబాబుతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా ఉదయభాను జనసేనలో చేరికను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో  సామినేని ఉదయభానుకు కీలక పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అదలా ఉంచితే..కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లే మిగిలేటట్లు ఉన్నారు. వారు వైసీపీకి ‘కాపు’ కాయగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారు తమ నోటి దురుసుతో ప్రజలలో ప్రతిష్ట కోల్పోయారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.