విపక్షాల ఐక్యత, రానున్న సార్వత్రిక ఎన్నికలలో మోడీని దీటుగా ఎదుర్కొనడమే లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న విపక్షాలకు కాంగ్రెస్ స్పీడ్ బ్రేకర్ గా మారింది. ఆ పార్టీ ఏకపక్షంగా విపక్షాల ఐక్యత విషయంలో చేస్తున్న ప్రకటనలు విపక్ష పార్టీల ఐక్యతకు ఆదిలోనే గండి కొట్టేలా ఉన్నాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కారణంగా కాంగ్రెస్ కు ఒకింత సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేతలు అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు మొదటికే మోసం వచ్చేలా చేస్తున్నాయి. 2024 సార్విత్రిక ఎన్నికలలో విపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అంటే కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన ప్రకటన బీజేపీయేతర పక్షాల ఐక్యతా యత్నాలకు గండి పడేలా మారింది. కమల్ నాథ్ ప్రకటన ఐక్యతా ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదులా మారింది.
కామన్ అజెండాపై చర్చించుకుని, పొత్తులు, పోటీ చేసే స్థానాలు, పార్టీల బలాబలాలపై ఒక అంచనాకు వచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకోవలసి ఉండగా, కమల్ నాథ్ ఏకపక్షంగా రాహులే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి అని ప్రకటించడం పట్ల బీజేపీ యేతర పార్టీలలో అసంతృప్తి వ్యక్తమౌతోంది. భారత్ జోడో యాత్రలో మెరుపులూ ఉన్నాయి. మరకలూ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ రాహుల్ జోడో యాత్రపై వ్యక్తం చేసిన అభిప్రాయం, ఆ యాత్రకు ఆహ్వానం అందినా హాజరు కాబోనంటూ ఆయన చేసిన ప్రకటన.. కాంగ్రెస్ కు విపక్షాలలో సర్వామోదం లేదనడానికి నిదర్శనం అనడంలో సందేహం లేదు.
అలాగే రైతు సమస్యలపై గళమెత్తుతున్నా తికాయత్ వంటి రైతు నేతలు ఇంకా కాంగ్రెస్ తో అడుగు కలిపేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ స్థితిలో అన్ని పార్టీలనూ కలుపుకుపోయేందుకు సంయమనంతో వ్యవహరించాల్సిన కాంగ్రెస్ సీనియర్లు.. ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో ఐక్యతారాగంలో ఆదిలోనే అపశ్రుతులు పలికిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. భారత చరిత్రలో రాహుల్ గాంధీలా ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన నేత మరొకరు లేరన్న కమల్ నాథ్, అధికారం కోసం వెపర్లాడుతూ రాజకీయాలు చేసే తత్వం ఆయనది కాదంటూనే.. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు ప్రస్తావిస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి రాహులే అని ముక్తాయించడం ఒక విధంగా విపక్షాల ఐక్యతకు ముందరి కాళ్లకు బంధం వేయడం లాంటిదేనని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kamalnath-statement-a-hurdle-to-unity-of-opposition-39-149407.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.