ఏ క్షణంలోనైనా ఎంపి అవినాష్ అరెస్ట్?

Publish Date:Jan 24, 2023

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కోరినట్లుగా మంగళవారం (జనవరి 24)న విచారణకు హాజరుకాలేననీ, బిజీ షెడ్యూల్ ఉందనీ పేర్కొంటూ.. మరో రోజు విచారణకు హాజరౌతాననీ, అందుకు   ఐదు రోజులు గడవు కోరుతూ సీబీఐకి బదులిచ్చారు.

అయితే అవినాష్ సమాధానంతో సంతృప్తి చెందని సీబీఐ ఆయనను అదుపులోనికి తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పులివెందుల వెళ్లేందుకు అదనపు భద్రత కావాలంటూ సీబీఐ కడప ఎస్పీని, ఇతర ఉన్నతాధికారులను కోరింది. దీంతో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది.   సీబీఐ అధికారులు.. కడప నుంచి ఇప్పటికే పులివెందులకు బయలు దేరారు.   భారీగా భద్రతతో సీబీఐ బృందం పులివెందులకు బయలుదేరడంతో.. అవినాష్ ను అరెస్టు చేస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి  వేరే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించిన సందర్బంలో కేసు దర్యాప్తునకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అడ్డుతగులుతున్నారంటూ సీబీఐ సర్వోన్నత న్యాయ స్థానానికి నివేదించిన సంగతి విదితమే. ఇప్పడు సుప్రీం ఆదేశాలతో కేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి మారిన అనంతరం సీబీఐ దర్యాప్తుజోరు పెరిగింది.  

మొదటి నుంచీ ఈ కేసు విచారణను నీరుగార్చడానికి పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు తొలి నుంచీ ఉన్నాయి. వివేకా హత్య జరిగినప్పుడు గుండెపోటు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి , ఆ తరువాత గొడ్డలి పోటని తేలిన తరువాత అప్పటి  ముఖ్యమంత్రిపై ఆరోపణలు గుప్పించి, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన న జగన్.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో న్యాయపోరాటం చేసి సీబీఐ విచారణకు కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చేలా చేశారు. అయితే సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అవరోధాలు కలిగేలా అధికార పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ.. కేసును వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించారు.  

ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కూడా సునీత పేర్కొన్న ప్రతి అంశం అక్షర సత్యమని సుప్రీం కు తెలియజేసింది. దీంతో కేసును తెలంగాణకు సుప్రీం బదలీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అవినాష్ అరెస్టు అనివార్యమన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. పులివెందులకు భారీ భద్రతతో పయనమైన సీబీఐ అధికారులు అవినాష్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.