జూబ్లీహిల్స్ రేప్ కేసు... నిందితుల్లో నలుగురు మేజర్లే!
Publish Date:Oct 1, 2022
Advertisement
ఈ ఏడాది మే 28న జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ గ్యాంగ్‌రేప్ కేసు మరో మలుపు తిరిగింది. హైదరా బాద్‌లో సంచలనం సృష్టించిన బాలిక రేప్ కేసులో జువైనెల్ కోర్టు నిందితులుగా పేర్కొన్న ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ తీర్పునిచ్చింది. విచారణ సమయంలో నలుగురు మైనర్ల నూ మేజర్లు గానే తీసుకోవాలన్నారు. అయితే సైకియాట్రిస్ట్ నివేదిక ప్రకారం వారు నేరసమయలో పదహారు నుంచి 18 ఏళ్ల లోపువారే కావడతో పోలీసులు జువైనల్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఏడాది మే 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వచ్చిన రొమేనియా మైనర్ బాలికపై సాదుద్దీన్ అనే యువకుడితో పాటు ఐదుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విష యం తెలిసిందే. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి ఆ తర్వాత సాయం త్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టగా..ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే, నిందితులు తీవ్రనేరానికి పాల్పడ్డారు గనుక మేజర్లుగానే పరిగణించాలని కోర్టును పోలీసులు కోరారు. ఈ కారణంగా జువెనైల్ బోర్డు విచారణ చేపట్టింది. నిందితులు నలుగురికి మద్యం అలవాటు లేదని, నేర సమయంలో మద్యం తాగలేదని బోర్డు నిర్ధారించింది. చివరికి ఐదుగురు మైనర్ నిందితుల్లో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకు విష యంలో మాత్రం ప్రాథమిక అంచనాకి రాలేకపోయింది బోర్డు. ఎమ్మెల్యే కొడుకుపై ఉన్న అభియోగం తీవ్ర మైనది కాకపోవడంతో మైనర్‌గా పరిగణించాలని జువెనైల్ జస్టిస్ బోర్డు నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/juvenile-court-declared-4-of-the-rape-case-as-majors-39-144738.html





