Publish Date:Apr 10, 2026
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి శుక్రవారం (ఏప్రిల్ 10) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. రాజీనామా చేయాలని ఆయనకు గతంలోనూ సూచనలు అందినప్పటికీ అప్పట్లో ఆయన అందుకు నిరాకరించారు. ఇప్పుడు ఆయన తప్పుకోవడం న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
గత ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున నగదు కనిపించింది. కాలిపోయిన నోట్లతో పాటు కొన్ని వందల నోట్ల కట్టలు బయటపడటంతో ఈ అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయ మూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించడంతో పాటు, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.
అంతర్గత విచారణ కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నగదుతో తనకు సంబంధం లేదని ఆయన వాదించినప్పటికీ విచారణలో ఆ నగదు ఆయన నివాసంలోనిదే అని తేలింది. ఈ క్రమంలోనే ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియను ప్రారం భించేందుకు 146 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. ఈ అభిశంసన ప్రక్రియ వేగవంతం కావడంతోనే ఇప్పుడు ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
ఇలా ఉండగా, యశ్వంత్ వర్మ రాష్ట్రపతికి పంపిన లేఖలో తన రాజీనామాకు గల కారణాలను వివరించకుండా.. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పదవిలో కొనసాగడం ఇష్టం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలాంటి తీవ్ర ఆర్థిక ఆరోపణలతో అభిశంసన ఎదుర్కొంటూ రాజీనామా చేయడం అత్యంత అరుదు.
జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాతో ప్రస్తుతం సాగుతున్న అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందా లేదా అన్నవిషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా రాజీనామా చేసిన తర్వాత అభిశంసన ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం సదరు వ్యక్తిని పదవి నుంచి తొలగించడమే. అయితే ఇక్కడ యశ్వంత్ వర్మపై నమోదైన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/justice-yashwant-varma-resigns-25-217069.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.