న్యాయమూర్తులపై ఆరోపణలు కొత్తకాదు !
Publish Date:Jun 6, 2012
Advertisement
ఈ వ్యాఖ్యాలను నూటికి నూరుసార్లు నిజమని హైదరాబాద్ కు చెందిన సిబిఐ న్యాయమూర్తి పట్టాభిరామారావు రుజువు చేశారు. ఆదర్శంగా వుండవలసిన న్యాయవవస్థలో కూడా అవినీతి చోటు చేసుకోవడం బాధాకరమే అయినా న్యాయమూర్తులు అవినీతి ఆరోపణలకు గురికావడం కొత్త విషయం కాదు ఈ వ్యాఖ్యాలను నూటికి నూరుసార్లు నిజమని హైదరాబాద్ కు చెందిన సిబిఐ న్యాయమూర్తి పట్టాభిరామారావు రుజువు చేశారు. ఆదర్శంగా వుండవలసిన న్యాయవవస్థలో కూడా అవినీతి చోటు చేసుకోవడం బాధాకరమే అయినా న్యాయమూర్తులు అవినీతి ఆరోపణలకు గురికావడం కొత్త విషయం కాదు. ప్రజాస్వామ్యంలో సుప్రీమ్ కోర్టుకు అత్యున్నత స్థానం వుంది. అటువంటి ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేసినవారిపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. శ్రీమతి ఇందిరాగాంధి 1984 ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చిన జస్టిస్ రంగానాథ్ మిశ్రా, కొబ్బరినూనె దిగుమతి చేసుకోవడంలో నిబంధనలు పాటించని ఒక కంపెనీకి ఎక్సైజ్ శాఖ విధించిన అయిదు కోట్ల రూపాయల జరిమానాను తగ్గించిన కేసులో జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్, 1997లో బోపాల్ గ్యాస్ బాధితులకు సంబంధించిన నష్టపరిహారం విషయంలో జష్టిస్ ఎ.ఎం.ఆహ్మాది, 1998లో కోర్టు వెలుపల జరిగిన ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకొని కేసును నీరుగార్చిన విషయంలో జస్టిస్ ఎం.ఎం.పుంచి, జమ్ము- కాశ్మీరులో ఒక హోటల్ కు సంబంధించిన కేసు విషయంలో జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్, సీలింగ్ భూముల కేసుల విషయంలో జస్టిస్ వై.కె.సబర్ వాల్ లు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలకు గురైన కర్నాటక హైకోర్టుకు చెందిన ప్రధాన న్యాయమూర్తిని ఇంపిచ్ మెంట్ చేయడానికి రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆ న్యాయమూర్తి రాజీనామా చేసి ఇంపించ్ మెంట్ నుంచి తప్పించుకొన్నారు. ఇటువంటి ఉదాహరణలు చాలానే వున్నాయి.
http://www.teluguone.com/news/content/justice-corruption-24-14658.html





