భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ పార్టీ అని పేరు గడించింది. వాక్ స్వాతంత్రానికి ఆ పార్టీలో నూకలు చెల్లు అనే టాక్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శించవచ్చు. వాళ్ల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం అత్యంత అరుదు.
కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతుండగా బిజెపిలో కొత్తగా చేరికలు ఉండడం లేదు. ఉన్నవారినే కాపాడుకోవడం గగనమైంది కెసీఆర్ కూతురు కల్వ కుంట్ల కవితను అరెస్ట్ చేస్తే తమ పార్టీ అధికారంలో రావడం నేత కల్ల అని చేవెళ్ల మాజీ ఎంపీ, బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో బిఆర్ ఎస్ మూడోసారి అధికారంలో రాదని తమ పార్టీ మాత్రమే అధికారంలో రాగలుగుతుందని బిజెపి నేతలు గొప్పగా చెప్పేవారు. కానీ కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపి పరాజయంతో తెలంగాణ బిజెపి నేతలు జోరు తగ్గించారు. కవితను అరెస్ట్ చేస్తేనే తెలంగాణలో బిజెపి అధికారంలో రాగలుగుతుందని ప్రచారం చేస్తున్నారు. బిజెపి జాతీయ నేత ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో 40 మంది బిజెపి అభ్యర్థులు దొరకడమే గగనమన్నారు. మా పార్టీకి అభ్యర్థులు కరవయ్యారు అని సంచలన కామెంట్ చేశారు. అతనిపై ఇప్పటి వరకు పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. గతంలో ఇంద్ర సేనారెడ్డి చేరికల కమిటీలో ఉండి చేరికలను ప్రోత్సహించారు. ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేరికల కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే చేరికల కమిటీ చైర్మన్ హోదాలో ఆయన పొంగులేటి, జూపల్లిలకు ఆహ్వానం పలికారు.
కవితను అరెస్ట్ చేయలేని మీ పార్టీ ప్రభుత్వం మేము చేరితే ప్రజలు మమ్మల్ని ఓడగట్టడం ఖాయమన్నారు. మేమే కొత్త పార్టీ పెడుతున్నాం మీరే మా పార్టీలో చేరండి అని పొంగులేటి, జూపల్లిలు ఈటెలను ఆహ్వానించారు. చేసేదేమి లేక ఈటెల వెనుదిరిగిపోయారు. బిజెపిలో చేరికల కమిటీకి బదులు ఎగ్జిట్ కమిటీ పెట్టి బిజెపినుంచి బయటకు వెళ్లే వారిని కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/joinings-in-bjp-nil-39-156266.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!