Publish Date:Apr 29, 2022
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెలలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జార్ఖండ్ సీఎంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. నెల రోజుల వ్యవధిలోనే ఇరువురు సీఎంలూ రెండో సారి భేటీ కావడంతో కీలక రాజకీయ పరిణామంపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని చెబుతున్నారు. త్వరలో హస్తినలో బీజేపీయేతర సీఎంల భేటీ ఏర్పాటు విషయంపై వీరిరువురి మధ్యా మంతనాలు జరిగాయనీ అంటున్నారు.
అయితే ‘మేఘా’ సహా మరో రెండు కంపెనీలకు జార్ఖండ్ లో కాంట్రాక్టుల విషయంపై సీఎం కేసీఆర్స్వ స్యంవగా జార్ఖండ్ సీఎంకు సిఫారసు చేశారనీ, వీరిరువురి మధ్యా ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింని చెబుతున్నారు. సీఎంల భేటీలో ‘మేఘా’డీల్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలోనే జార్ఖండ్ లో మేఘా కంపెనీ, మరో రెండు కంపెనీలకు కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గురువారం హైదరాబాద్ వచ్చిన శిబు శొరేన్ నిన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు. శుక్రవారం కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇక్కడ ఒక ప్రైవేటు హోటల్ లో ఆయన బస చేశారు.
ఇలా ఉండగా జార్ఖండ్ సీఎం వర్గాల కథనం ప్రకారం హేమంత్ సొరేన్ తన తల్లి వైద్యం కోసం హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డితో కేసీఆర్ స్వయంగా మాట్లాడి అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేశారని చెబుతున్నారు. హైదరాబశుక్రవారం శిబుసొరేత్ తల్లికి ఆ వైద్యుడు ఆపరేషన్ చేశారు.
శనివారం జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గనేందుకు హేమంత్ సొరేన్ హైదరాబాద్ నుంచే ఢిల్లీ వెళతారు. అనంతరం తిరిగి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే బస చేస్తారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jharkhand-cm-meet-with-kcr-for-megha-deal-25-135198.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.