మహారాష్ట్ర, జార్ఖండ్.. బీజేపీకే పట్టం- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా

Publish Date:Nov 20, 2024

Advertisement

మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో బీజేపీ జయకేతనం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఈ సారి ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఈ సారి ఎన్నికలలో జార్ఖండ్ లో బీజేపీ 42నుంచి 48 స్థానాలలో విజయం సాధించి సాధారణ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించు కుంటుందని పేర్కొంది. 16 నుంచి 23 స్థానాలతో  జార్ఖండ్ ముక్తి మోర్చా రెండో స్థానంలోనూ 8 నుంచి 14 స్థానాలతో కాంగ్రెస్ మూడో స్థానంలోనూ నిలుస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. అలాగే మహారాష్ట్రలో కూడా బీజేపీ నాయకత్వంలోని మహాయతి కూటమి 175 నుంచి 195 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని పేర్కొంది. 

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. బుధవారం అన్ని స్థానాలకూ కలిపి ఒకే విడతలో పోలింగ్  జరిగింది. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా జేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలతో కూడిన  మహా వికాస్ అఘాడీ మధ్య పోరు సాగింది. తొలి అంచనాల ప్రకారం ఈ ఎన్నికలలో హోరాహోరీ తప్పదని అంతా భావించినా పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీ నేతృత్వంలోని మయాయతి కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందని తేలింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయత కూటమి 175 నుంచి 195 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ 85 నుంచి 112 స్థానాలకే పరిమితం ఔతుంది.

మహాయతి కూటమిలో బీజేపీ సొంతంగా 102 నుంచి 120 స్థానాలలోనూ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 46 నుంచి 51 స్థానాలలోనూ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 14 నుంచి పాతిక స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. 

ఇక కాంగ్రెస్ నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ సొంతంగా  24 నుంచి 44 స్థానాలలోనూ, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన 21 నుంచి 31 స్థనాలలలోనూ, శరద్ పవాన్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 28 నుంచి 41 స్థనాలలోనూ విజయం సాధిస్తుంది. ఇతరులు 6 నుంచి 12 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. 

By
en-us Political News

  
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.