జాహ్నవి కపూర్ ఏఐ మార్ఫింగ్ వీడియోపై కేసు.!
Publish Date:Oct 4, 2026
Advertisement
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.! ఏఐ టెక్నాలజీ పేరుతో జరుగుతున్న దుర్వినియోగం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ప్రముఖ నటి జాహ్నవి కపూర్‌కు సంబంధించిన వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వీడియోలోని దృశ్యాలను తీసుకుని వాటిని డిజిటల్‌గా మార్చి అభ్యంతరకరమైన రీతిలో చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జాహ్నవి కపూర్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘దేవర: పార్ట్-1’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన ఫుటేజీని ఉపయోగించి ఈ మార్ఫింగ్ వీడియోను రూపొందించారు. ఒరిజినల్ వీడియోలోని జాహ్నవి పాత్రను ఆధారంగా చేసుకుని, ఏఐ టెక్నాలజీతో అసలు లేని దృశ్యాలను సృష్టించి నకిలీ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఏఐ ద్వారా రూపొందించిన అభ్యంతరకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సర్క్యులేషన్‌కు రావడంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. వీడియోను ఎవరు రూపొందించారు? ఎక్కడి నుంచి మొదట అప్లోడ్ చేశారు? ఏ టెక్నాలజీ లేదా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు? ఎంతమంది దానిని షేర్ చేశారు? అనే కోణాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మార్ఫింగ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్‌ను తయారు చేయడమే కాకుండా.. అది నకిలీదని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం కూడా చట్టపర మైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో వీడియో తయారీదారులతో పాటు దాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందిం చారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మహిళలను అవమానించేలా నకిలీ వీడియోలు తయారు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు. అంతే కాదు.. ఇలాంటి నకిలీ వీడియోలు వైరల్ అవుతున్న సమయంలో ఎవ్వరు కూడా వాటిని ఆసక్తితో చూడటం, డౌన్లోడ్ చేయడం, ఇతరులకు పంపడం లేదా సోషల్ మీడియాలో మళ్లీ షేర్ చేయడం చేయొద్దని కూడా సూచించారు. నకిలీ వీడియోను వైరల్ చేయడం ద్వారా బాధితురాలికి మరింత నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాహ్నవికి చిరంజీవి అండ.! ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా తీవ్రంగా స్పందించారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మహిళలపై ఇలాంటి దాడులకు పాల్పడటం ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. ఒకరి ఫొటో లేదా వీడియోను తీసుకుని, వారు చేయని పనిని చేసినట్లు చూపించే విధంగా మార్ఫింగ్ చేయడం వారి గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు సినీ పరిశ్రమ, ఫిల్మ్ సంస్థలు, సైబర్ క్రైమ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చిరంజీవి సూచించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వీడియో ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో అనేక కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. [ Janhvi Kapoor, Janhvi Kapoor Deepfake Video, AI Morphed Video, Hyderabad Cyber Crime Police, Jr NTR, Chiranjeevi, Chuttamalle Song, Devara Part 1, AI Misuse, Deepfake Case, Cyber Crime Investigation, Social Media Viral Video, Celebrity Deepfake, Women Safety, Digital Crime, AI Technology, Cyber Crime Hyderabad, Fake Video Case, Deepfake Controversy, Telugu Cinema ]
జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం.!
అయితే ఇదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల ముఖాలను, శరీర ఆకృతులను మార్చి నకిలీ వీడియోలు తయారు చేయడం ఇప్పుడు తీవ్ర సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేయడం వారి వ్యక్తిగత గౌరవానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ప్రముఖ నటీనటుల విషయంలో ఇలాంటి ఘటనలు చోటుచే సుకుంటే అవి క్షణాల్లో వేలాది మందికి చేరుతున్నాయి.జాహ్నవి కపూర్‌కు సంబంధించిన ఈ ఏఐ మార్ఫింగ్ వీడియో వ్యవహారం కూడా ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియో నిజమైనది కాదని, ఏఐ సాయంతో క్షణాల్లో నకిలీ కంటెంట్ సృష్టించే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి అసలు ఈ వీడియోను తయారు చేసిన వ్యక్తులే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.
http://www.teluguone.com/news/content/janhvi-kapoor-25-233359.html





