Publish Date:Jun 23, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అటు ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటూనే, ఇటు పార్టీ అంతర్గత కార్యాచరణను కూడా ఆయనే ముందుకు తీసుకువెడుతున్నారు. దీంతో పవన్ వర్క్‌లోడ్‌తో పవన్ సతమతమవుతున్నారు. ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది.
ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి, పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా వారిలో కదలిక వచ్చింది.
పవన్ కళ్యాణ్ క్లాస్ పీకడంతో జనసేన అగ్ర నేతలైన కందుల దుర్గేష్, పంతం నానాజీ వంటి వారు యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. ప్రతిపక్షాల వ్యూహాత్మక విమర్శలను తిప్పికొట్టేందుకు మీడియా ముందుకు వచ్చి ప్రతి విమర్శలు చేస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ అంశంపై వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్రంగా ఖండించారు. ఈ సున్నితమైన అంశాన్ని వాడుకుని ఒక ప్రత్యేక సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్‌పై వ్యతిరేకత పెంచాలని చూస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు. కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టడం జనసేనకు అత్యంత అవసరంగా మారిందనడంలో సందేహం లేదు.
మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలకు జనసేన నాయకుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కుల ప్రస్తావన లేకుండా, పవన్ కళ్యాణ్ ఒక్క సీటైనా గెలవగలరా అన్న అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ గా.. జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల దాటి బయట ఎక్కడైనా నిలబడి గెలిచే దమ్ముందా అని నిలదీశారు. సత్తా ఉంటే కాకినాడ రూరల్ నుంచి గెలిచి చూపాలని సవాల్ విసిరారు. జనసేన నాయకత్వం ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించడం ఆ పార్టీ కార్యకర్తలలో జోష్ ను నింపింది. జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఇదే జోష్ ముందుముందు కూడా కొనసాగాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janasena-steps-up-the-aggression-39-223861.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.