ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఛైర్మన్ పీఠం
నిడదవోలు మునిసిపాలిటీలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. కౌన్సిల్ సభ్యులు ఎత్తుకు పైఎ త్తులు వేస్తున్నారు. ఎలాగైనా సరే చైర్మన్ కుర్చీని కైవశం చేసుకోవాలని అటు వైసీపీ, వైసీపీని చిత్తుగా ఓడించాలని జనసేన వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇది లా ఉండగా గురువారం (ఏప్రిల్ 3) మునిసిపల్ చైర్మన్‌పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీసీ కౌన్సిలర్లు ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. నిడదవోలు మునిసిపాలిటీలో 28 వార్డులకు 2021 మార్చి 15వ తేదీన ఎన్నికలు జరగగా 27 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. ఒక వార్డులో మాత్రమే తెలుగుదేశం విజయం సాధించింది. దీంతో నిడదవోలు కౌన్సిల్ వైసీపీ వశమైంది. ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మె ల్యే జి.శ్రీనివాస్ నాయుడు చైర్మన్ పదవీ కాలాన్ని పంచుకునేలా ఒప్పందం కుదిర్చారు. మొదటి రెండున్నరేళ్లు మునిసిపల్ చైర్మన్‌గా భూపతి ఆదినారాయణ, తరువాత రెండేళ్లు కామిశెట్టి వెంకట సత్యనారాయణ తరువాత మిగిలిన కాలం పువ్వల రతీదేవి చైర్మన్‌గా ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనివాస్ నాయుడు ఓటమి పాలయ్యారు. నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, చైర్మన్ భూపతి ఆదినారాయణకు మధ్య ఉన్న ఆర్థిక, ఆంతరంగిక వ్యవహారాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో భూపతి ఆది నారాయణతో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో చైర్మన్ ఒప్పందం వివాదం ముదిరి పాకాన పడింది. మునిసిపల్ కౌన్సిల్ ఏర్పడి ఈ నెల 18వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తవడంతో అవిశ్వాస తీర్మానానికి అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్ పి.ప్రశాంతి, కొవ్వూరు ఆర్డీవో రాణిసుస్మితలకు వినతిపత్రం అందజేశారు. చైర్మన్ పై అవిశ్వాసానికి తమకు అవకాశం ఇవ్వా లంటూ పలువురు వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు పెట్టారు.ఈ నేపథ్యంలో నిడదవోలులో ఎటు చూసినా చైర్మన్ కుర్చీపైనే చర్చ సాగుతోంది.
తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. దీనితో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు సంఖ్య 28గా ఉంటే.. వైసీపీ నుంచి గెలిచిన 27 మందిలో ఇప్పటి వరకు 12 మంది కౌన్సిలర్లు పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్ సంఖ్య 16కు తగ్గింది. ఒక టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు.
జనసేన పార్టీకి ఉన్న 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓటు వేసే అవకాశం లభిస్తుంది. వీరికి తోడు కౌన్సిల్ లో టీడీపీకి ఒక సభ్యుడు ఉన్నారు. దీనితో జనసేన బలం 16, వైసీపీ బలం కూడా పదహాగా ఉంది. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన.. వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janasena-check-to-ycp-39-195449.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.