Publish Date:Apr 27, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాది. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూకాశ్మీర్ పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఘటన తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయించింది. దాడి జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23 నుంచే ఎన్ఐఏ బృందాలు పహల్గామ్లోని ఘటనా స్థలంలో మోహరించాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. సుందరమైన పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఈ భయానక దాడిని ప్రత్యక్షంగా చూసిన సాక్షులను ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు.
సంఘటన జరిగిన తీరును, ఉగ్రవాదుల కదలికలను కూలంకషంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఉగ్రవాదులు పర్యాటకుల వద్దకు వచ్చి, వారి మతాన్ని అడిగి తెలుసుకుని, హిందువులని నిర్ధారించుకున్న తర్వాత కాల్పులు జరిపారని తెలిసింది. మృతుల్లో 25 మంది హిందూ పురుషులు ఉన్నారు. ఉగ్రవాదులు ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు, దాడి తర్వాత ఎలా తప్పించుకున్నారు అనే కోణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఎన్ఐఏ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఘటనా స్థలంలో లభించే ప్రతి చిన్న ఆధారాన్ని జాగ్రత్తగా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఈ దారుణ మారణకాండ వెనుక ఉన్న ఉగ్ర కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది. భారత భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పేల్చివేశాయి. ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేతలో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. జమీల్ 2016 నుంచి లష్కరేలో క్రియాశీలంగా ఉన్నాడు. గత రాత్రి త్రాల్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మొహ్మద్ (జేఈఎం) సంబంధాలున్న ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా బలగాలు పేల్చివేశాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jammu-and-kashmir-39-197013.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.