బూమరాంగ్ అవుతున్న జగన్ బలప్రదర్శన యత్నాలు.!
Publish Date:Jul 16, 2026
Advertisement
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను చేసే ప్రతి పర్యటనలోనూ.. క్కడ అడుగుపెట్టినా బలప్రదర్శన చేయాలన్న ఆత్రం తప్ప.. తాను ఎందుకు పర్యటన చేస్తున్నారు అన్న ధ్యాస కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆయన బుధవారం (జులై 15) భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి. దీంతో ఆశించిన సానుకూలతకు బదులుగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా బుధవారం (జులై 15)పర్యటనల్లోనూ అదే జరిగింది. ముందుగా ఆయన భీమవరంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి రవాణా సమస్యలతో బాధపడుతున్న స్థానిక ఆక్వా రైతులకు మద్దతుగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. అయితే ఆయన భీమవరం పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్వయంగా జగనే దాని వల్ల ఇబ్బందులు పడ్డారు. సొంత మద్దతు దారులే ముందుకు తోసుకుని రావడంతో ఆయన వేదికపై బొక్కబోర్లా పడినంతపనైంది. భీమవరం సభకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై జగన్ చుట్టూ చేరిన అభిమానులు ఆయనను తాకేందుకు, ఆయన దృష్టిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. స్వయంగా తన మద్దతు దారుల తోపులాట కారణంగానే జగన్ వేదికపై అదుపు తప్పి బోర్లా పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు కనుక సరిపోయింది కానీ.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పరిశీలకులు అంటున్నారు. సరే బలప్రదర్శన కారణంగా భీమవరంలో జరిగిన నిర్వాకం చాలదన్నట్లుగా దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు కూడా జగన్ భారీ ర్యాలీతో వెళ్లారు. జగ్గయ్య పేట నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకున్న జగన్ పర్యటన అంత్యక్రియలకు వెడుతున్నట్లుగా కాకుండా ఏదో యుద్ధానికి వెడుతున్నారా అన్నట్లుగా భారీ ర్యాలీగా సాగింది. మరణించిన నేతకు నిశ్శబ్దంగా నివాళు లర్పించాల్సిన సమయంలో ఇలాంటి భారీ ప్రదర్శనలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేదిక వద్ద జగన్ రాకతో హడావుడి, గందరగోళం నెలకొన్నాయి సీనియర్ నేత చివరి వీడ్కోలు కార్యక్రమం కాస్తా, రాజకీయ బలప్రదర్శనగా ప్రదర్శనగా మారిందని ముద్రగడ అభిమానులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. YS Jagan Mohan Reddys tour, Bhimavaram aqua farmers protest, Mudragada Padmanabham's funeral, YSRCP turmoil
http://www.teluguone.com/news/content/jagans-attempts-to-demonstrate-strength-backfiring-25-226182.html




