నాకు రెస్పెక్ట్ కావాలి మొర్రో!

Publish Date:Aug 1, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ వైసీపీ  శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్ వేయాలని శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్‌కి విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు సీనియర్ న్యాయవాది చెబుతున్నందున దీనిపై వివరాలు సమర్పించాలంటూ అసెంబ్లీ, స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. వ్యాజ్యం విచారణార్హతకు లోబడి ఈ ఉత్తర్వులుంటాయని పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల మంత్రి  పయ్యావుల కేశవ్‌కు  నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. 

అసెంబ్లీలో ప్రతి పక్ష నేత హోదా ఇచ్చేలా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పైమంగళవారం జరిగిన విచారణలో ఆయన తరఫున  న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు పిటిషనర్ అర్హుడని చెప్పగా, న్యాయమూర్తి స్పందిస్తూ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేనందున, వ్యాజ్యంపై లోతైన విచారణ జరపాల్సి ఉందన్నారు. ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశిస్తామన్నారు. శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, 'అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. కౌంటర్ వేసేందుకు మాకు సమయమివ్వండి. వ్యాజ్యం లోతుల్లోకి వెళ్లే ముందు విచారణార్హతను తేల్చాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కేశవ్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడం అభ్యంతరకరం' అని వాదించారు. ప్రతిపక్ష నేత హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరని న్యాయమూర్తి ప్రశ్నించగా, 'స్పీకర్' అని ఏజీ బదులిచ్చారు. జగన్ తరపు  న్యాయవాది శ్రీరామ్ వాదనలు 
కొనసాగిస్తూ ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని స్పీకర్‌కి వినతిపత్రమిచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకరుకు న్యాయస్థానం నోటీసు ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు. మహారాష్ట్రలో స్పీకరుకు సుప్రీం కోర్టు నోటీసు ఇచ్చిన సందర్భముంది. ఈ కేసులోనూ స్పీకర్ కార్యదర్శికి నోటీసు ఇచ్చి మా విజ్ఞప్తిపై ఏ నిర్ణయం తీసుకున్నారో స్పష్టత కోరాల'ని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. స్పీకర్‌కి జగన్ విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నందున ఏం నిర్ణయం తీసుకున్నారో చూద్దామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీచేశారు. 

అయితే ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. న్యాయవ్యవస్థ తన పరిధి దాటి శాసన వ్యవస్థలోకి ఎలా చొచ్చుకు రాగలుగుతుంది అనేది ప్రశ్న..! అసెంబ్లీకి అధిపతి స్పీకర్. శాసన వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ.  కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జ్యూడిషరీ శాసన వ్యవస్థ నిర్ణయాలని తప్పుపడుతుంది అది ఎప్పుడూ...  ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అని అనుకున్నప్పుడు.  ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదు . జగన్ పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదు అనేది ఏజీ దమ్మాలపాటి వాదన.  స్పీకర్ చేయాల్సిన నిర్ణయాన్ని కోర్టే చేసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించండి అని స్పీకర్ ను ఆదేశిస్తుందా..? ఒకవేళ ఆదేశిస్తే స్పీకర్ ఆ అంశాన్ని పక్కన పెడితే ఏమవుతుంది ? స్పీకర్‌ని హైకోర్టు బోనులోకి పిలిపించి నిల్చోపెడుతుందా? అంటే అది రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు పడ్డట్టే లెక్క. 

ప్రతిపక్ష నాయకుడు అనేది చట్టబద్ధమైన స్థానం తప్ప 10% రూల్ అనేది చట్టంలో లేదు. భారత పార్లమెంటు సభలలో ప్రతిపక్ష నాయకుడు అనేది ఒక చట్టబద్ధమైన పదవి. ఈ పోస్ట్ పార్లమెంట్ చట్టం, 1977లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల కోసం  ప్రతిపక్షంలో సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు హోదాగా నిర్వచించింది. ఆ గుర్తింపు స్పీకర్ లేదా  చైర్మన్ ద్వారా గుర్తించబడుతుంది.  మోడీ మొదటిసారి ప్రధాని అయిన 2014 నుంచి 2019 వరకు  రెండోసారి ప్రధాని అయిన 2019 నుండి  2024 వరకు  నాటి పార్లమెంట్ స్పీకర్  కాంగ్రెస్ పార్టీకి  ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు! పది సంవత్సరాల పాటు  కాంగ్రెస్‌కు  ప్రతిపక్ష హోదా లేకుండానే  ప్రజా క్షేత్రంలో  పోరాటం చేసింది.  మొన్న జరిగిన  ఎన్నికల్లో  ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ సాధించింది.  రాహుల్ గాంధీ  నాకు  రెస్పెక్ట్ కావాలి అని  గోల గోల చేయలేదే!  కోర్టు మెట్లు ఎక్కలేదే!  కాని  ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం  జగన్  రెడ్డి  నాకు  రెస్పెక్ట్ కావాల్సిందే అని  కోర్టుకు ఎక్కారు.  ప్రజలే  ఇవ్వని  రెస్పెక్ట్ కోసం కోర్టు ద్వారా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. రెస్పెక్ట్ అనేది కొనుక్కుంటేనో కోరుకుంటేనో  వచ్చేది కాదు! అది ఎదుటి వారు ఇచ్చేది అనే సూక్ష్మం జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోవటం విషాదం.  అదేదో సినిమాలో  బ్రహ్మానందం నాకు  రెస్పెక్ట్ కావాలని  ప్రేక్షకులను  నవ్విస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి ఒక పక్కా లెక్క ముందస్తు ప్రణాళిక వ్యూహం ఉంటాయి. దీంట్లో జగన్ ఎత్తులు పై ఎత్తులు ఏంటో జరగబోయే పరిణామాలేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.