ప్రక్షాళన పేరిట వైసీపీ సిట్టింగులకు జగన్ ఉద్వాసన?

Publish Date:Aug 22, 2022

Advertisement

ప్రభుత్వ వ్యతిరేకత, కేసులు, పార్టీలో అసమ్మతి ఏపీ సీఎం జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే.. ముందుగా ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి వారికి స్థాన చలనం కల్పించడమే మార్గమన్న నిర్ణయానికి వచ్చారు.

అందుకే వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 58 నియోజకవర్గాలలో కొత్త వారికి పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే 11 లోక్ సభ నియోజకవర్గాలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గల్లంతేనని చెబుతున్నారు. ఆ మేరకు పార్టీ వర్గాల ద్వారా ఎమ్మేల్యేలను మార్చే నియోజకవర్గాల జాబితా ఒకటి బయటకు వచ్చింది. ఆ జాబితా మేరకు ఉత్తరాంధ్ర నుంచి కురుపం, ఎచ్చర్ల, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎస్. కోట, బొబ్బిలి, గజపతినగరం, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణ, పాయకరావుపేట, నర్సిపట్నం, అరకు వేలీ, గాజువాక, పాడేరు, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా నుంచి జగ్గంపేట, పిఠాపురం, పత్తి పాడు, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, రంపచోడవరం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నుంచి పాలకొల్లు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల నుంచి సిట్టింగులకు కాకుండా కొత్త వారికి టికెట్లిచ్చి రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

అలాగే   విజయవాడ వెస్ట్, కైకలూరు, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ,  సత్తెనపల్లి, మంగళగిరి, తాడికొండ, తెనాలి, బాపట్న, పొన్నూరు, వేమూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు, కందుకూరు, మర్కాపురం, కొండెపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, పూతలపట్టు, శ్రీ కాళహస్తి, పలమనేరు సింగనమల, హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం,  కల్యాణదుర్గం, కర్నూలు, పత్తి కొండ, నందికొట్కూరు, మైదకూరు, పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా సిట్టింగులకు కాకుండా కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

ఇక లోక్ సభ నియోజకవర్గాల సంగతి తీసుకుంటే.. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, విజయవాడ, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, నర్సాపురం, ఏలూరు లోక్ సభ స్థానాలలో సిట్టింగులకు అవకాశం లేనట్లేనని చెబుతున్నారు. ఆయా స్థానాలలో కొత్త వారికి పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

వివిధ సర్వే బృందాల నుంచి అందిన నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాలలో సిట్టింగులకు 2024 ఎన్నికలో పోటీకి అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇవే కాకుండా రానున్న రోజులలో మరిన్ని నియోజకవర్గాల విషయంలో కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆయా సిట్టింగుల పని తీరు, వారిపై నెలకొన్న ప్రజావ్యతిరేకత ఆధారంగా జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. 

By
en-us Political News

  
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.