కాంగ్రెస్ వైపు జ‌గ‌న్ చూపు.. ష‌ర్మిళ‌ గేమ్‌ప్లాన్ షురూ !

Publish Date:Aug 13, 2024

Advertisement

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూట‌మితో జ‌త క‌ట్టేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో తీవ్ర ఇబ్బందులు పడిన  ఏపీ జనం తెలుగుదేశం కూట‌మికి భారీ మెజార్టీతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో రెండు నెల‌ల కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉండ‌టంతో ప్ర‌జ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. మ‌రో వైపు అధికారంలోఉన్న స‌మయంలో పెద్ద ఎత్తున భూముల క‌బ్జాలు, అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారించింది. పూర్తిస్థాయిలో ఆధారాలు సేక‌రించి చ‌ట్ట‌ప‌రంగా శిక్షించేందుకు పోలీస్ ఉన్న‌తాధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో వైసీపీ నేత‌లు ఒక్కొక్కరుగా జైలు కెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి భూ దందా వ్య‌వ‌హారాలు వెలుగులోకి వ‌చ్చాయి. త్వ‌ర‌లో ఆయ‌న అరెస్ట్ ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు అగ్రి గోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు. చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో త్వ‌ర‌లో జోగి ర‌మేశ్, టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులోవ‌ల్ల‌భ‌నేని వంశీ.. ఇలా ఒక్కొక్క‌రుగా వైసీపీ నేత‌లు జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

 వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న‌పై పదకొండు కేసుల్లో సీబీఐ కోర్టులో విచారణ జ‌రుగుతోంది. ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణం రాజు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదైంది. కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ.. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వంలోనూ భాగ‌స్వామిగా ఉంది. దీనికి తోడు కేంద్ర ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు నాయుడు కీల‌కంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విష‌యంలో ఎప్పుడైనా జైలుకు వెళ్తారన్న టాక్ ఏపీ రాజకీయ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మ‌రోవైపు వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక్కొక్క‌రుగా జ‌గ‌న్ కు దూర‌మ‌వుతున్నారు  అధికారం కోల్పోయిన త‌రువాత అన్నివైపుల నుంచి ముప్పు త‌రుముకొస్తుండ‌టంతో జ‌గ‌న్ అల‌ర్ట్ అవుతున్నారు. ఎన్డీయే కూట‌మి వైపుకు వెళ్లేందుకు ద్వారాలు మూసుకుపోవ‌డంతో ఇండియా కూట‌మిలో చేరితే కాస్త‌యినా జాతీయ పార్టీల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది‌. ఈ క్ర‌మంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల‌తో జ‌గ‌న్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం శివ‌కుమార్ ద్వారా ఇండియా కూట‌మిలో భాగ‌స్వామి అయ్యేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు  సాగిస్తున్నార‌ని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయ‌న త‌ర‌చూ బెంగ‌ళూరు వెళ్తున్నార‌ు‌. ఇటీవ‌ల బెంగ‌ళూరు వెళ్లిన స‌మ‌యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో జ‌గ‌న్ భేటీ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

 వారం రోజుల కిందట బెంగళూరులో రాహుల్ గాంధీతో జ‌గ‌న్ రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు స‌మాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చేయ‌డం కాకుండా ఇండియా కూట‌మిలో చేర‌తామ‌ని రాహుల్ తో జ‌గ‌న్ చెప్పిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. కానీ, రాహుల్ గాంధీ మాత్రం వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనే నీకు రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని సూచ‌న చేసిన‌ట్లు స‌మాచారం. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్ కొన్ని గొంతెమ్మ కోర్కెలు కోరగా, రాహుల్ గాంధీ వాటికి నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి డిమాండ్లు చేయడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయి, ఇప్పుడిలా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయావని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా జగన్ తో అన్నట్టు సమాచారం.   స‌మ‌యం తీసుకొని మీ అభిప్రాయం చెప్పాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాహుల్ సూచించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 
జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండ‌టంలో ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల అల‌ర్ట్ అయ్యారు.  

ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న మార్పుల‌కు అనుగుణంగా భవిష్యత్ ను అంచనా వేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ లో మరింత పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు‌. కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల తీరుతో ఇప్ప‌టికే ఓ వ‌ర్గం అసంతృప్తితో ఉన్న‌ట్ల తెలుస్తోంది. వారికి చెక్ పెట్ట‌డంతో పాటు.. ఒక‌వేళ జ‌గ‌న్   కాంగ్రెస్ పార్టీతో జత‌ క‌లిసినా, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఇబ్బందులు తలెత్త‌కుండా పార్టీలో త‌న వ‌ర్గాన్ని బ‌లోపేతం చేయడంపై ఆమె దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌, జిల్లా స్థాయి క‌మిటీల్లో త‌న‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ష‌ర్మిల ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావిస్తున్నారు‌. తాజాగా ఢిల్లీలో రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.. ఆసమావేశంలో పాల్గొనేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో తాను సూచించిన వ్యక్తులకు చోటు కల్పించాలంటూ ఏఐసీసీ నేతలకు ఆ సందర్భంగా షర్మిల పెద్ద జాబితానే సమర్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పూర్తిగా తనకు మద్దతుదారులుగా ఉన్న నేతల పేర్లే షర్మిల పొందుపరిచారని స‌మాచారం. త‌న అనుకూల వ‌ర్గానికి పార్టీ ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డం ద్వారా రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీలో త‌న ప‌ట్టు చేజారిపోకుండా ష‌ర్మిల వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.