నాలుగేళ్ళ నరకం! వైసీపీపై తెలుగుదేశం పాశుపతాస్త్రం

Publish Date:Jun 27, 2023

Advertisement

ఏపీలో ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉన్నా రాజకీయాలు మాత్రం రోజురోజుకీ హీటెక్కుతుతూనే ఉన్నాయి. అటు అధికార  వైసీపీ, ఇటు ప్రతిపక్ష  తెలుగుదేశం ఆధిపత్యం కోసం కొత్త కొత్త స్ట్రాటజీలతో ప్రజల మధ్యకి వస్తున్నాయి. ఎలాగూ ప్రతిపక్షాలకి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు బోలెడన్ని అంశాలు, అవకాశాలు   ఉంటాయి. ఈ క్రమంలో తులుగుదేశం ఇప్పటికే వైసీపీ అరాచకాలు దౌర్జన్యాలు, రాష్ట్రంలో పెరిగిన నేరాలపై తూర్పార పడుతూ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ఓ కార్యక్రమంతో ముప్పు తిప్పలు పెట్టింది.

రాష్ట్రంలో ప్రతి దానిపై విధిస్తున్న పన్నులపై ప్రజలలో అవగాహనా కల్పించేలా బాదుడే బాదుడు అనే మరో కార్యక్రమాన్ని కూడా టీడీపీ దిగ్విజయంగా నిర్వహిస్తున్నది. ఇప్పుడు దీనికి తోడుగా మొత్తం నాలుగేళ్ళ జగన్ ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యకాండలను ప్రజలకు గుర్తు చేస్తూ జగన్ కు తగిన బుద్ది చెప్పేందుకు నాలుగేళ్ళ నరకం అనే మరో కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టింది.

ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని విడుదల చేశారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా తొలి రోజు 'ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?' అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు గురించి ప్రశ్నిస్తూ తొలి వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఇటీవల బాపట్ల జిల్లాలో బాలుడి హత్య, ఏలూరు జిల్లాలో మహిళపై జరిగిన దారుణం, అలాగే నెల్లూరు జిల్లాలో పట్టపగలు మహిళపై అత్యాచారం వంటి వాటితో పాటు, ఆయా ఘటనల్లో వైసీపీ నేతలు, ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన స్పందన వంటి వాటిని చూపించారు. ఇక, ఈ ప్రచార కార్యక్రమం 'నాలుగేళ్ళ నరకం'లో రంగాల వారీగా జరిగిన అన్యాయాన్ని ఎత్తి  చూపుతూ.. నాలుగేళ్ళలో నలభై ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు. 

జగన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడమే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం కాగా, దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో ఈ నాలుగేళ్ళ నరకం పేరుతో టీడీపీ గల్లీ నుండి పట్టణాలు, నగరాల వరకు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపుతూ ముందుకు సాగనున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం తొలి నుండి లేవనెత్తుతున్న అంశం లా అండ్ ఆర్డర్. జగన్ ప్రభుత్వంలో వ్యవస్థలు పరిధి దాటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడిచాయి ఇదే విషయంలో న్యాయస్థానాలతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిన్నది జగన్ సర్కార్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం కోర్టు బోనులలో నిలబడి న్యాయమూర్తుల చేత చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇక, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వారిని మతి స్థిమితం లేని పిచ్చి వారిని చేసిన వైనాలు కూడా రాష్ట్ర ప్రజలు చూశారు.

దీంతో పాటు వైసీపీ నేతల ఆగడాలు, ఇసుక నుండి మట్టి వరకు యథేచ్ఛగా జరిగిన దోపిడీ, కొండలను సైతం పిండిచేసి అమ్ముకోవడం ఇలా ఒక్కటేమిటీ చెప్పుకుంటూ పోతే మరో నాలుగేళ్లు కావాలేమో. ఇలాంటి వాటన్నిటినీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ   గుర్తు చేస్తూ  జగన్  నాలుగేళ్లు ప్రజలకు ఎలా నరకం చూపించారో కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. ఈ కార్యక్రమంతో తెలుగుదేశం సమరశంఖం ఊదడంతో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. మరి ఈ కార్యక్రమంపై అటునుంచి అంటే వైసీపీ నుంచి స్పందన ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.