అంబటి రాంబాబు పదవి పీకేసిన జగన్.. సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి

Publish Date:Jan 10, 2025

Advertisement

అంబటి రాంబాబును వైసీపీ వదిల్చేసుకుంటోందా? ఆయన సొంత నియోజకవర్గం సత్తెన పల్లి ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి అంబటిని తప్పించడం ద్వారా ఆయనకు తన స్థానం ఏమిటో చూపిందా? అంటే వైసీపీ శ్రేణులే ఔనని అంటున్నాయి. అయినదానికీ కాని దానికీ ప్రత్యర్థి పార్టీల నేతలపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో, అసంబద్ధ విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు ఇక  సత్తెన పల్లి నియోజకవర్గ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత విస్పష్టంగా చెప్పేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 

ఉరుములేని పిడుగులా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సత్తెన పల్లి నియోజకవర్గ  సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించినట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని  ఆ ఉత్తర్తులలో పార్టీ  కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ ఉత్తర్వుల ద్వారా అంబటికి ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో పని లేనట్టేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నారు.

కంటి తుడుపు చర్యగా ఆయనకు పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తే ఇవ్వచ్చు కానీ, చెప్పా పెట్టకుండా నియోజకవర్గ సమన్వయకర్త పోస్టు పీకేయడం అంటే అంబటికి అవమానమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ అవమానాన్ని దిగమింగుకుని అంబటి పార్టీ తరఫున విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ తన నోటి దూల తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోవచ్చు. ఆయన మాట్లాడకపోయినా పార్టీ పట్టించుకోదు.  

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.