Publish Date:Oct 25, 2024
పరామర్శలు, ఓదార్పులలో వైసీపీ అధినేత, మాజా ముఖ్యమంత్రి జగన్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటారు. ఆయన ప్రతి పరామర్శ, ప్రతి ఓదార్పు రాజకీయ ప్రయోజనంతోనే ముడిపడి ఉంటుంది. అసలు జగన్ రాజకీయ ప్రస్ధానం ఇలాంటి పరామర్శలతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన జగన్.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అంటూ ఓదార్పు యాత్ర చేపట్టారు. అది సుదీర్ఘంగా సాగింది. రోజులు, వారాలు, నెలలు కాదు ఏళ్ల తరబడి సాగింది.
సాధారణంగా ఎవరయినా చనిపోతే వారి ఆత్మీయులు వెంటనే వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామ ర్శించి ఓదార్చి వస్తారు. కానీ మనిషి పోయిన ఏళ్ల తరువాత వెళ్లి పరామర్శ చేసి వస్తే ఏమనాలి. అసలు ఎవరు ఎవరిని పరామర్శిస్తున్నారన్న కన్ఫ్యూజన్ ఏర్పడేలా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. ఎన్నికలలో మైలేజ్ కోసమే అన్నట్లుగా ఆయన అప్పట్లో చేపట్టిన ఓదార్పు యాత్రలు ఫలితాన్ని ఇవ్వలేదు. 2014 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి. ఇప్పుడు జగన్ మళ్లీ ఓదార్పు లేదా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో జగన్ మళ్లీ ఓదార్పు యాత్రలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు ఏ కారణంతో చనిపోయినా జగన్ వెంటనే అక్కడ వాలిపోతున్నారు. నెత్తిన చేతులు పెట్టి, అలింగనం చేసుకుని మృతుల కుటుంబీకులను ఓదారుస్తున్నారు. పనిలో పనిగా అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలూ గుప్పించేస్తున్నారు.
అలాగే గతానికి భిన్నంగా తన ఓదార్పు సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ప్రకటన అయితే చేస్తున్నారు కానీ.. ఆ సాయం తక్షణం అందించడం లేదు. సాధారణంగా ఎవరైనా ఓదార్పు, పరామర్శకు వచ్చిన సమయంలో బాధిత కుటుంబానికి చేయదలచుకున్న సాయం చేసి వస్తారు. అయితే జగన్ రూటే సెపరేటు.. ఆయన ఘనంగా ప్రకటన అయితే చేస్తారు.. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు అందుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు.
ఎనన్నికలలో పరాజయం తరువాత తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఎక్కువగా బెంగళూరులోనే మకాం ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ఓదార్పుపర్యటనలకు మాత్రమే వస్తున్నారు. ఇటీవల గుంటూరులో మరణించిన మహిళ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల మాటసాయం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కు మాత్రం అందించలేదు. అలాగే అ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏపీలో 77 మంది అత్యాచారానికి గురయ్యారనీ, వారందరికీ పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాననీ కూడా ప్రకటించేశారు. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు ఎక్కడ ఎలా ఇస్తారో మాత్రం చెప్పలేదు. విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించేశారు. అంతకు ముందు విజయవాడ వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు. ఇలా ఆయన సాయం ప్రకటనలకే పరిమితమైంది కానీ బాధితులకు అందిన దాఖలాలు కనిపించడం లేదు. నిజానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రకటనతో పాటే సాయం కూడా అందజేయాలి. కానీ జగన్ ఎప్పుడూ అలా చేయలేదు. ఆయన ఓదార్పు పరామర్శ అంతా ఉత్తుత్తి సాయం ప్రకటనలు.. ఊకదంపుడు ప్రసంగాలతోనే సరిపోతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-odarpu-only-words-no-help-25-187384.html
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.