జగన్ చేతులు కాలిన తరువాత ఆకులు వెతుక్కుంటున్నారా?

Publish Date:Dec 4, 2024

Advertisement

రాజకీయాల్లో తనను తానో పెదరాయుడిగా ఊహించుకున్న జగన్.. పార్టీ నిర్వహణ నుంచి ముఖ్యమంత్రిగా పాలన సాగించడం వరకూ, పరాజయం తరువాత ఈవీఎంలపై నెపం నెట్టేసి, అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా మారిపోయాయంటూ గగ్గోలు పెట్టడం వరకూ అన్నీ కూడా అదే తరహాలో చేశారు.  అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెదరాయుడి తీరు నడిచిందేమో కానీ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన వ్యవహార శైలిని సొంత పార్టీ నేతలే భరించలేకపోతున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు.  అధికారంలో ఉన్నంత వరకూ జగన్ చూసి రమ్మంటే కాల్చేసి వచ్చినట్లుగా తెగరెచ్చిపోయిన నేతలు ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయనో కలిసి నడిచిన నేతలు కూడా ఇప్పుడు వేరు దారి చూసుకుంటున్నారు.  

మరో  వైపు జగన్ హయాంలో యథేచ్ఛగా అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఒక్కొక్కరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జగన్ హయాంలో జరిగిన అవకతవలక మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ పునాదుల్లోనే ఉన్నాయన్నది దర్యాప్తులో వెల్లడౌతుండటంతో.. సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత పోస్టుల నుంచి, అవినీతి, కుంభకోణాలు, హత్యల తీగ లాగే వరకూ అక్కర్లేకుండా ముట్టుకుంటేనే తాడెపల్లి డొంక కదిలిపోతున్నది. దీంతో జగన్ తో ఇంకా అంటకాగితే తమ పుట్టి మునుగుతుందన్న భయంతో ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు, కొందరైతే పార్టీకీ దూరమౌతున్నారు. 

 జగన్ కు సన్నిహితులుగా ఉన్న వారైతే ఉన్న పదవులకు సైతం రాజీనామాలు చేసేసి పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వదిలి వెడుతుంటే.. జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం నటిస్తూ..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే గతంలోలా ఆయన మాటలకు వంత పాడే వారు పార్టీలో కరవయ్యారు. అంబటి, పేర్ని వంటి ఒకరిద్దరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ వారిని పట్టించుకునే వారే కరవైన పరిస్థితి. ఇక పార్టీ క్యాడర్ ఇప్పటికే కకావికలైపోయింది. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి తరచూ మీడియా ముందుకు వస్తూ జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు.  

ఈ నేపథ్యంలోనే తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో  జగన్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.     ఈ సమావేశానికి రాష్ట్రంలోని పార్టీ అసెంబ్లీ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో  పార్టీ అభివృద్దితో పాటు భవిష్యత్ కార్యాచరణ  అజెండాగా  చెబుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి తరువాత నుంచి జగన్ ప్రజలలోకి వస్తారని చెబుతున్నారు.   ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పార్టీ క్యాడర్ తో భేటీ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పార్టీ క్యాడర్ నూ, ప్రజలనూ పట్టించుకోని జగన్ ఇప్పుడు వారితో మమేకమౌతానంటూ ముందుకు రావడాన్ని వారు స్వాగతించే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. 

వాస్తవానికి వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాజీలుగా మారిన నేతల్లో అత్యధికులు జగన్ తీరు కారణంగానే ఓటమి పాలయ్యామని బాహాటంగానే చాటారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలనూ, కార్యకర్తలనూ పూర్తిగా విస్మరించిన జగన్ క్షేత్ర స్థాయి వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించారు. చెబుదామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటూ గళమెత్తారు.   ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు  జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల డొంక కూడా కదులుతున్నట్లు భావిస్తున్నారు. ఆ కేసు విచారణ, దర్యాప్తు నత్తనడకన నడవడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం వివరాలన్నీ సమర్పించాల్సిందిగా సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ తరుణంలో పూర్తిగా చేతులు కాలిన తరువాత ఆకుల కోసం వెతికిన చందంగా జగన్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ  నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కీలకభేటీ కావడం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.