బొత్సపై జగన్ సీరియస్.. సమావేశంలో అందరి ముందే చిన్నబుచ్చిన వైనం

Publish Date:Sep 29, 2022

Advertisement

జగన్ రెడ్డి మరో సారి తన మంత్రివర్గ సహచరులలో కొందరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసిన వారిలో ఓ సీనియర్ మంత్రి కూడా ఉన్నారు. అయితే ఆయనను తప్పని సరిపరిస్థితుల్లో రెండో కేబినెట్ లో కూడా కొనసాగించినప్పటికీ.. ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకింత ఉక్కపోతకు గురి చేస్తూనే ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ ఆ మంతి అని చెబుతున్నారు.  బొత్స సత్యనారాయణను జగన్ తొలి కేబినెట్ లోకి తీసుకున్నారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా బొత్సకు మరోసారి అవకాశం ఉండదనే అంతా భావించారు. అయితే కారణాలేవైనా ఆయన తన మంత్రిపదవిని దక్కించుకున్నారు. అయితే పునర్వ్యవస్థీకరణలో బొత్సకు అప్రధానమైన శాఖను కేటాయించడం పట్ల ఆయన అప్పట్లోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి విదితమే. తొలి కేబినెట్ లో రాజధాని వ్యవహారాలను చక్కపెట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక  శాఖ నిర్వహించిన బొత్సకు, పునర్వ్యవస్థీకరణలో ఆయనకు ఏమాత్రం ఇష్ఠంలేని విద్యా శాఖను జగన్ అప్పగించారు.

అప్పట్లోనే తనను పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బొత్స బహిరంగంగా కాకపోయినా.. తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విదితమే.  విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే విషయంలోనూ ఆప్పట్లో ఆయన జాప్యం చేశారు. శాఖ మార్పు కోసం జగన్ ను కలిసేందుకు అప్పట్లో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఎం అప్పాయింట్ మెంట్ దొరకలేదని కూడా అప్పట్లో పార్టీలో గుసగుసలు వినిపించాయి. వీటన్నిటికీ తగ్గట్లుగానే ఆయన విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజులలో విద్యా శాఖ అధికారులు, బొత్సను పక్కన పెట్టేసి తమ పని తాము చేసుకుపోయారు. దాంతో  విద్యా శాఖలో ఏమి జరుగుతోందో, విద్యా శాఖ మంత్రికి తెలియని ఒక విచిత్ర పరిస్థితి అప్పట్లో నెలకొందని అంటునారు. మంత్రి ప్రమేయం లేకుండానే అప్పట్లో జీవోలు వచ్చేశాయి.

ఈ విషయంలో అప్పట్లో బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  మంత్రిగారి ఆదేశాలను అధికారులు అసలు పట్టించుకోని విచిత్ర పరిస్థితి అప్పట్లో విద్యాశాఖలో ఉండేది. పట్టిచుకోవడం లేదని అంటున్నారు.    రాష్ట్రంలో పాఠశాలల విలీనం ప్రక్రియను వెంటనే అపేయాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. ఆ సమయంలోనే  మంత్రి రివ్యూ మీటింగ్ పెడితే, సగం మంది అధికారులు గైర్హాజరయ్యారు. ఇక వచ్చిన  సగం మంది మంత్రి ఆదేశాలు అక్కడే చెత్త బుట్టలో పడేసి చక్కా పోయారని సెక్రటేరియట్ వర్గాలు అప్పట్లో జోకులు కూడా వేసుకున్నాయి. సీఎం ఆదేశాల మేరకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని అప్పట్లో రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 

సరే తరువాత తరువాత అదంతా సద్దుమణిగిందనుకుంటుంటే.. బుధవారం (సెప్టెంబర్ 28) జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో సీనియర్ మంత్రి అని కూడా చూడకుండా బొత్స ముఖం మీదే ఆయన పని తీరు బాగాలేదని జగన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసి చిన్నబుచ్చారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.