పవన్ దెబ్బకు జగన్ విలవిల!

Publish Date:Apr 17, 2023

Advertisement

జనసేనాని అనుకున్నది సాధించారా? ఏపీలో జగన్ పార్టీకి బీజేపీని దూరం చేయడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వను అన్న తన మాటను నిలబెట్టుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. జనసేన అధినేత తన పంతం నెగ్గించుకున్నారా? ఏపీలో జగన్ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యం అని ప్రకటించిన ఆయన అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అని పంతం పట్టారు.

ఇందు కోసం అసవరమైతే బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడి ఒప్పిస్తానని కూడా చెప్పారు. ఈ మాట ఆయన ఎప్పుడో చెప్పారు. ఆ తరువాత పదేపదే పునరుద్ఘాటించారు. అయితే ఆయన మాటలు గాలి మూటలేనా   అనిపించేలా ఇటీవలి ఆయన హస్తిన పర్యటనకు ముందు వరకూ రాష్ట్ర బీజేపీ నేతల తీరు ఉండింది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలపై పలు సందేహాలు ఉండేవి. ఒక వైపు ఏపీలో జగన్ సర్కార్ కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటే.. మరో వైపు రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో జనసేన, బీజేపీల మైత్రి విచ్ఛిన్నం కావడం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా ఉండింది. ఈ నేపథ్యంలోనే పలు మార్లు జనసేనాని బీజేపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్రంలోని అగ్రనాయత్వం కానీ ఈ నాలుగేళ్లలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలూ  నిన్న మొన్నటి దాకా కనిపించలేదు.

అయితే తాడో పేడో తేల్చుకోవడానికి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఇటీవల రెండు రోజులు హస్తిన లో మకాం వేసి మరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చలు జరిపి వచ్చారు. ఆ సందర్భంగా హస్తిన వేదికగా పవన్ కల్యాణ్ విలేకరులతో మాట్లాడారు. అప్పుడు కూడా పొత్తుల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ తన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిందన్న ఒక్క మాటతో సరిపెట్టేశారు. నడ్డాతో భేటీ తరువాత సంయుక్తంగా మీడియా ముందుకు రాకపోవడం, జగన్, నాదెండ్ల ఇరువురు మాత్రమే తప్పదన్నట్లుగా హస్తినలో మీడియాతో మాట్లాడటం, అదీ ముక్తసరిగా సరిపెట్టేయడంతో బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో కూటమిగా ఏర్పడేందుకు విముఖత చూపిందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన తరువాత బీజేపీ కేంద్ర నాయకత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. అలాగే రాష్ట్ర నాయకత్వ గళం కూడా మారింది. అంతకు ముందులా రాష్ట్రంలో అధికార వైసీపీ పట్ల సానుకూలత తగ్గినట్లు స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే.. వైసీపీ సర్కార్ విధానాలపై బీజేపీ రాష్ట్ర సర్కార్ విమర్శల దాడి పెంచడం చూస్తుంటే.. పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన తరువాత వైసీపీ సర్కార్ పట్ల బీజేపీ వైఖరి మారినట్లుగా స్పష్టమౌతోంది.

అన్నిటికీ మించి వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి వద్దకు సీబీఐ వస్తోందన్న భావన కలిగితే చాలు ఏపీ సీఎం జగన్ అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని హస్తినలో వాలిపోయేవారు. ఈ సారి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ అరెస్టు చేసినా.. అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా ఐదో సారి సమన్లు జారీ చేసిన జగన్ తన పర్యటనలైతే రద్దు చేసుకున్నారు కానీ.. హస్తిన బాట పట్టలేదు. అలాగే సీబీఐ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, అవినాష్ రెడ్డిని ఐదో సారి విచారించేందుకు నోటీసు ఇవ్వడం, ముందస్తు బెయిలు కోసం అవినాష్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ స్పష్టంగా అవినాష్ ను అవసరమైతే అరెస్టు చేస్తామని చెప్పడం చూస్తుంటే.. సీబీఐ దూకుడును అడ్డుకునే ప్రయత్నాలేవీ కేంద్రం నుంచి జరగడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద పవన్ హస్తిన పర్యటన ఒకే దెబ్బకు రెండు పిట్లలు అన్నట్లుగా వైసీపీకి బీజేపీని దూరం చేయడమే కాకుండా... తెలుగుదేశం కు దగ్గర చేర్చేందుకు దోహదపడిందని అంటున్నారు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.