లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం.. సిట్ అరెస్టులపై మింగలేక కక్కలేక జగన్?

Publish Date:Feb 11, 2025

Advertisement

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైసీపీ పూర్తిగా ఇరుక్కుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచ్చులో జగన్ చిక్కుకున్నారా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. తిరుమలలడ్డూ ప్రసాదం కల్తీ విషయం తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో  వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ చేశారంటూ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో పూర్తిగా రాజీపడ్డారనీ, కాసుల కక్కుర్తితో కల్తీ నెయ్యి వాడకానికి తలుపులు బార్లా తెరిచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీపై విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఈ తరుణలో సుప్రీం కోర్టు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ విషయంపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్ ను నియమించింది.

సుప్రీం కోర్టు నియమించిన సిట్ లో సీబీఐ నుంచి ఇద్దరు సభ్యులు, రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరు సభ్యులు, అలాగే కేంద్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ నుంచి ఒక సభ్యుడూ ఉణ్నారు. ఈ స్వతంత్ర సిట్ ఏర్పాటైన తరువాత కొంత కాలం నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎటువంటి వార్తలూ వినిపించలేదు. పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వైసీపీయులు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారంటూ విమర్శలు గుప్పించింది. తమ పార్టీని అప్రదిష్ట పాలు చేయడానికే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని దుయ్యబట్టింది. చంద్రబాబు చేసినవి అసత్య ఆరోపణలు కనుకనే ఆయన కల్తీ నెయ్యి విషయం మాట్లాడటం లేదని విమర్శలు గుప్పించింది. సుప్రీం కోర్టు నియమించిన సిట్ దర్యాప్తులో చంద్రబాబు ఆరోపణలన్నీ సత్యదూరాలని తేలుతాయనీ, అందుకే ఆయన మౌనం వహించారనీ ఎడాపెడా చెలరేగిపోయింది. 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను కూడా ఇందులోకి లాగి.. చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి ఆరోపణలు చేసినందుకే వెంకన్న దేవుడికి ఆగ్రహం వచ్చిందని, అందుకే ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగిందనీ భాష్యాలు చెప్పింది. ఇతర విషయాలపై దృష్టి పెట్టారని విమర్శలు గుప్పించింది. వైసీపీ నేతలే కాదు స్వయంగా వైసీపీ అధినేత జగన్ కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టు స్వతంత్ర సిట్ ను నియమించడంతో తన అసత్యాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారనీ, అందుకే మౌనం వహించారనీ జగన్ విమర్శలు గుప్పించారు. ఇలా విమర్శలు గుప్పించడం ద్వారా తాము సుప్రీం కోర్టు నియమించిన సిట్ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తుందని విశ్వసిస్తున్నామని చెప్పకనే చెప్పినట్లైంది. 

అయితే ఇక్కడ చంద్రబాబు మౌనం వైసీపీకి వేసిన ట్రాప్ అని ఇప్పుడు తేటతెల్లమైంది.  ఎందుకంటే తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తి నెయ్యి వినియోగం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు నియమించిన సిట్ కొన్ని అరెస్టులు చేసింది. ఇప్పుడు తన దర్యాప్తులో స్వతంత్ర సిట్ కనుగొన్న విషయాలను వైసీపీ, జగన్ అంగీకరించి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అరెస్టులన్నీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వెనుక వైసీపీయుల హస్తం ఉందని రుజువు చేసేవిగానే ఉన్నాయి. దీంతో  వైసీపీ, జగన్ పరిస్థితి ఇప్పుడు కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది. 

అదే చంద్రబాబు సుప్రీం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన తరువాత కూడా ఈ అంశంపై తరచుగా మాట్లాడుతూ, దర్యాప్తు పురోగతిపై ఆరాతీస్తూ ఉండి ఉంటే.. జగన్, ఆయన పార్టీ నేతలూ సిట్ పై తమకు నమ్మకం లేదంటూ ప్రకటనలు గుప్పించేవారు. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా మైనం వహించడం ద్వారా చంద్రబాబు జగన్ కు ఉచ్చు పన్నారని భావించాల్సి ఉంటుంది. సిట్ దర్యాప్తులో నెలల పాటు ఎటువంటి పురోగతీ కనిపించకపోవడంతో ఇది కూడా తన అక్రమాస్తుల కేసులా మూలనపడినట్లే అని భ్రమించిన జగన్ చంద్రబాబు అబద్ధాలు చెప్పారనీ, సిట్ దర్యాప్తు సజావుగా సాగుతోందనీ, దానిపై విశ్వాసం ఉందనేలా ప్రకటనలు గుప్పించి నేరుగా చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నట్లైంది.  ఈ కేసులో సిట్ ఇప్పటికే ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖర్, వైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, భూలేబాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్ లను అరెస్టు చేసింది. దీంతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు అభూత కల్పనలు కావనీ, అక్షర సత్యాలనీ రుజువైనట్లైంది. ఇప్పుడు అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లను మార్చేసి, ఇష్టం వచ్చిన వారికి కట్టబెట్టినట్లు సందేహాతీతంగా రుజువైంది. వైసీపీ అధినేత జగన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.