అమరావతి నా వల్ల కాదు.. అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన జగన్

Publish Date:Sep 15, 2022

Advertisement

 ముఖ్యమంత్రి జగన్ అమరావతి నిర్మాణం తన వల్ల కాదని చేతులెత్తేశారు. కేవలం పదివేల కోట్ల రూపాయలతో విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయవచ్చని మూడేళ్ల తరువాత కనిపెట్టిన ఆయన అమరావతి అభివృద్ధి చేయాలంటే వందేళ్లు పడుతుందని చెప్పారు.   పాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన జగన్  అమరావతి కట్టాలంటే లక్షల కోట్లు అవసరమంటూ పాత పాటనే పల్లవించారు.

అంత డబ్బు లేదని బేలగా చెప్పారు. ఏపీ బీద రాష్ట్రం అని, రాష్ట్రంలో 80శాతం మంది జనం తెల్ల రేషన్ కార్డుదారులేననీ జగన్ చెప్పారు. ఇంత పేద రాష్ట్రానికి రాజధాని అవసరమేముందన్న అర్ధం వచ్చేలా ఆయన ప్రసంగం సాగింది.  అమరావతిని నిర్వీర్యం చేయడానికి అధికారం చేపట్టిన మూడేళ్లలో జగన్ చేయని ప్రయత్నం లేదు. మూడు రాజధానులంటూ మొదలు పెట్టి అమరావతిలో అభివృద్ధి పనులను నిలిపివేశారు. తన కేబినెట్ మంత్రుల చేత అది ఒక శ్మసానం అంటూ వ్యాఖ్యలు చేయించారు. వరద వస్తే మునిగిపోతుందని ప్రచారం చేయించారు. అమరావతి రైతుల ఆందోళనను పట్టించుకోలేదు. ఇప్పుడు మూడేళ్ల తరువాత   అమరావతి భూముల విషయంలో జగన్ నమ్మశక్యం కాని లెక్కలు చెప్పారు. అమరావతిలో ఉన్న భూములు విలువ లేనివని సూత్రీకరించి ప్రజలను నమ్మించాలని ప్రయత్నించారు.  

మూడేళ్ల పాటు అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసి, అమరావతిని స్మశానంగా అభివర్ణించి.. ఇప్పుడు ఆ భూములను అమ్మకానికి పెట్టి ఎవరూ కొనడం లేదు కనుక అవి విలువలేనివని సూత్రీకరించడానికి జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నించారు.  అసెంబ్లీ సాక్షిగా  జగన్ ఈ మూడేళ్లలో  గ్రామ, వార్డు సచివాలయాలు వినా తాను సాధించినదేమీ లేదని అంగీకరించేశారు. అంతకు మించి  ఏపీకి ఇంకేం అభివృద్ధి కావాలి అన్న చందంగా ఆయన ప్రసంగం సాగింది. మొత్తం మీద అసెంబ్లీ సాక్షిగా  రాజధాని నిర్మాణం తన వల్ల కాదని చేతులెత్తేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నానని చెప్పిన జగన్ అందు కోసం ఈ మూడేళ్లలో తాను చేసిందేమిటో చెప్పలేకపోయారు.

అన్నిటికీ మించి తన ప్రసంగంలోని డొల్ల తనాన్ని తెలుగుదేశం సభ్యులు సభలోనే ఎత్తి చూపుతారన్న అనుమానమో, భయమో కానీ, జగన్ ప్రసంగం ప్రారంభించే సమయానికి విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయిన తరువాతనే ఆయన మైక్ అందుకున్నారు. టీడీపీ సభ్యులు ఉన్నప్పుడు సభ సజావుగానే   వైసీపీ సభ్యుల ప్రసంగాలు, వాటికి తెలుగుదేశం కౌంటర్లు ఇలా సభ  ఎలాంటి అవాంతరాలూ లేకుండానే జరిగింది. అయితే జగన్ ప్రసంగించే సమయంలో ఆయన ప్రసంగానికి తెలుగుదేశం సభ్యులు కౌంటర్ ఇవ్వకూడదనో, లేక వారి ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చుకోలేనో జగన్ వారిని సభ నుంచి బయటకు పంపిన తరువాతే మాట్లాడటం మొదలు పెట్టారు.  

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.