ప్రజా విశ్వాసం కోల్పోయిన జగన్ సర్కార్..!

Publish Date:Jul 18, 2022

Advertisement

ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారనడానికి  ఆ ప్రభుత్వం తన పథకాలను వివరించడానికి ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వాళ్లు నిలదీసే తీరులోనూ, ఏవైనా పనులకు టెండర్లు పిలిస్తే వాటికి వచ్చే స్పందనలోనూ.. ఇంకా చెప్పాలంటే ఆదాయం కోసం భూములు వేలానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంలోనూ తెలుస్తుంది. ఆ విధంగా చూస్తే  ఏపీలోని  జగన్ సర్కార్ పై జనాలు పూర్తిగా నమ్మకం కోల్పోయారనడానికి ఒకటి రెండూ కాదు వందల ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

కాంట్రాక్టర్లు  పనులకు టెండర్లు వేయడం లేదు. గతంలో చేసిన పనులకు సొమ్ముల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అంతెందుకు  వైసీపీ నేతలు కూడా కనీసం చిన్న చిన్న పనులను  నామినేషన్ కింద చేపట్టడాని కూడా ముందుకు రావడం లేదు. ఇఖ  జగనన్న లే ఔట్లు అంటూ ప్రభుత్వం స్థలాలను అమ్మడానికి చూస్తుంటే వాటిని కొనడానికి సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. మూడు రాజథానులలో ఒకటైన  పాలనా రాజధాని అని  చెబుతున్న విశాఖలోనే ప్రభుత్వ ప్లాట్లను కొనుగోలు చేయడానికి  ఎవరూ ముందుకు రావడం లేదు.  

జగనన్న లే ఔట్ల పేరుతో  విశాఖలో  రెండు వేల ప్లాటను జగన్ సర్కార్ వేలానికి పెట్టింది. ఇందుకోసం భారీగా ప్రచారం కూడా చేసింది. తీరా వేలం నిర్వహిస్తే  కనీసం  రెండు వందల  మంది కూడా ఆన్ లైన్ లో అప్లై చేయలేదు. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి  విడతగా కట్టాల్సిన డబ్బులు కట్టిన వారు కేవలం 70 మందే.      జగనన్న లేఔట్ల పేర  ప్రభుత్వం నేరుగా అమ్ముతున్నా జనం కొనడాగిని ముందుకు రాకపోవడం ఎలా చూసుకున్నా ఈ ప్రభుత్వంపై జనంలో విశ్వాసం లేదనే తేటతెల్లమౌతున్నది. ఎందుకంటే ప్రభుత్వమే విక్రయించే స్థలాలకు  క్లియర్ టైటిల్ ఉంటుంది.

అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలూ రావు. అని జనం భావిస్తారు. కానీ జగన్ సర్కార్ విక్రయానికి పెట్టిన లే ఔట్లను కొనుగోలు చేయడానికి జనం నుంచి  స్పందన లేకపోవడమే ప్రభుత్వ విశ్వసనీయత ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్ధమౌతుంది. అదే గత  తెలుగుదేశం ప్రభుత్వం  అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే భారీ స్పందన వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్లాట్లు మొత్తం అమ్ముడు పోయాయి.

జగన్  ప్రభుత్వం భూముల విక్రయానికి వేలం వేస్తే జనం  కనీసం పట్టించుకోవడం లేదు.  గడపగడపకూ  మన ప్రభుత్వం, సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తెలిసిందే. ప్రజల్లో జగన్ సర్కార్ పలుకుబడి పూర్తిగా పడిపోయిందనడానికి ఇవే నిదర్శనాలని విపక్షాలు అంటున్నాయి. ఎప్పుడూ విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్  ఇప్పుడు తన సర్కార్ పైనే జనాలు విశ్వాసం కోల్పోయారనడానికి కనిపిస్తున్న తార్కానాలపై ఏం చెబుతారని ప్రశ్రిస్తున్నారు.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.