పార్టీ కీలక నేతలతో జగన్ బేటీ.. ఏం చర్చించారంటే?

Publish Date:Apr 17, 2023

Advertisement

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు అనూహ్యంగా పెంచిన నేపథ్యంలో జగన్ కోటరీలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కడప ఎంపీ  అవినాష్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి మేనమామ అయిన వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టు తరువాత ఈ భయం మరింత పెరిగింది. ఈ కేసులో పాత్ర ధారులు, సూత్ర ధారులెవరన్నది తేలిపోయే దశకు వచ్చిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సోమవారం (ఏప్రిల్ 17) సీబీఐ విచారణను తప్పించుకున్న అవినాష్ రెడ్డి మంగళవారం ( ఏప్రిల్ 18) అనివార్యంగా సీబీఐ ఎదుట హాజరు కాకతప్పదు.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సందర్బంగా  కోర్టు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందా అన్న కోర్టు ప్రశ్నకు సీబీఐ తరఫు న్యాయవాదులు అవసరం అయితే అరెస్టు చేస్తామని బదులిచ్చారు. అలాగే భాస్కరరెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందనీ, ఆయన పిటిషన్ కోర్టు విచారణలో ఉండగానే అరెస్టు చేయడం అక్రమమనీ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనను మధ్యలో అడ్డుకున్న కోర్టు.. పిటిషన్ విచారిస్తామన్నామే కానీ.. అరెస్టు చేయవద్దని ఆదేశించలేదుగా అని వ్యాఖ్యనించింది. ఈ నేపథ్యంలోనే గతంలో అవినాష్ రెడ్డి సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఏప్రిల్ 18) అవినాష్ రెడ్డిని విచారించిన అనంతరం ఆయనను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది.

సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదించిన మేరకు ఈ నెల 30 లోగా వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగానే సీబీఐ విచారణను వేగవంతం చేసింది. వరుస అరెస్టులతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత  జగన్ పార్టీ ముఖ్యనేతలతో సోమవారం (ఏప్రిల్ 17) అత్యవసరంగా సమావేశమయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివేకా హత్య చేసులో బాస్కరరెడ్డి అరెస్టుతో జగన్ ఆది, సోమవారాలలో తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. చివరాఖరికి జగనన్న విద్యా దీవెన పథకం కింద అనంత జిల్లాలో ఏర్పాటు చేసిన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని సైతం రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం ప్యాలెస్ లోనే పార్టీకి చెందిన కీలక నేతలతో భేటీ అయ్యారు.    ఈ కేసులో బాధితుల తరఫు వారూ, నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారూ కూడా జగన్ ను సమీప బంధువులే కావడంతో ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు వైసీపీపై కూడా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వైపు జగన్ కు స్వయానా చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత.. మరో వైపు సీఎం సతీమణి మేనమావ, ఆయన కుమారుడు.. దీంతో ఈ కేసులో ఏ పరిణామమైనా నేరుగా జగన్ కుటుంబంపైనే ప్రభావం చూపుతోంది.  అంతే కాకుండా వివేకా హత్య కేసులో వెలుగులోకి వస్తున్న అంశాలు సీమ రాజకీయాలలో కూడా ప్రభావం చూపుతున్నాయి.  అజాత శత్రువుగా పేరుపడిన వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్న అంశాలు, జరుగుతున్న అరెస్టులు అధికార పార్టీని పూర్తిగా డిఫెన్స్ లో పడేశాయి.

పైపెచ్చు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వివేకాపై ఇప్పుడు చేస్తున్న ఆరోపణలతో  వారికి పులివెందులలోనే కాకుండా కడప వ్యాప్తంగా ప్రతికూత ఎదురౌతోంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? పార్టీపై ఈ కేసు ప్రభావం పడకుండా ఎం చేయాలి అన్న విషయాలపై చర్చించేందుకే జగన్ పార్టీకి చెందిన కీలక నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.