అమరావతిపై జగన్ వి డ్రామాలే.!

Publish Date:Jul 6, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువన్ ఇంటర్వ్యూ లో ఆమె అమరావతిపై జగన్ కుట్రలను బయటపెట్టారు. అందరూ జగన్ ను సైకో సైకో అంటారు కానీ  తాను జగన్ సైకో తో పాటు శాడిస్ట్ కూడా అంటానన్నారు.  ఇటీవల విజయవాడలో ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జగన్, అమరావతి రాజధాని కాదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ  హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన పరిణామాలను, దళిత ప్రతినిధులుగా తాము అనుభవించిన మానసిక క్షోభను   వివరించారు.

2019 ఎన్నికల సమయంలో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవి..  అప్పట్లో సర్వేల ఆధారంగా అత్యంత క్లిష్టమైన రాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. అయితే..  గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, ఆయన కనీస గుర్తింపు ఇవ్వకుండా కేవలం తన బొమ్మ చూసి మాత్రమే గెలిచారంటూ చులకనగా మాట్లాడారని  ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జగన్ వైఖరి అత్యంత దారుణంగా ఉండేదన్న ఆమె..   పరిపాలన సాగించే క్రమంలో దళిత ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ఆయన ఏనాడూ గౌరవించలేదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకున్నారన్నారు. 

అధికారంలో ఉన్న పార్టీని, పదవులను వదులుకుని తాము బయటకు రావడానికి జగన్ పెట్టిన టార్చరే కారణమని శ్రీదేవి కుండబద్దలు కొట్టారు. 2023లోనే తాను వైసీపీని వీడి అప్పటి ప్రతిపక్షంలోకి రావడం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉందన్నారు. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితిని కల్పించారని, రాజధాని ప్రాంత రైతులపై దాడులు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేక తీవ్ర వేదన అనుభవించానని పేర్కొన్నారు.

అమరావతి, మూడు రాజధానులు, వైజాగ్ కాపురం, ఇప్పుడు కొత్తగా  మావిగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పదేపదే మాటలు మార్చడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఉండవల్లి శ్రీదేవి విశ్లేషించారు. నాడు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు అమరావతిలో పనులు చేస్తున్నట్లు కేవలం ఒక గంట పాటు డ్రామాలు ఆడారని, అదంతా కేవలం ప్రదర్శన  కోసమేనని  బయటపెట్టారు.

రాజధాని కోసం ఒక్క పైసా ఆశించకుండా 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నడూ   ప్రేమ లేదన్న శ్రీదేవి ఐదేళ్ల పాటు రైతులను నానా ఇబ్బందులు పెట్టిన జగన్..  ఇప్పుడు మళ్లీ వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య పరస్పర విభేదాలు సృష్టించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే జగన్ అసలు వ్యూహమని ఆరోపించారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాయల్‌గా సచివాలయానికి వస్తూ, రాజధాని అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని శ్రీదేవి కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు చేసే తాత్కాలిక రాజకీయాలు ఇకపై సాగవని, ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని శ్రీదేవి అన్నారు. 

 

Undavalli Sridevi Exclusive Interview, YS Jagan Mohan Reddy Strategy, Amaravati Capital Issue, Tadikonda Ex MLA Sridevi, Chandrababu Naidu Secretariat

 

By
en-us Political News

  
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.