ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా.. జగన్ తెగేదాకా లాగుతున్నారా?

Publish Date:Oct 15, 2022

Advertisement

వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాల్లోనూ విజయం సాధించాలన్న పగటి కలను సాకారం చేసుకోవడానికి జగన్ నేల విడిచి సాము చేస్తున్నారా? పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల సహనాన్ని తెగేదాకా లాగుతున్నారా? వంధిమాగధుల ప్రశంసలతో ఆయనకు దేవతా వస్త్రాలు తొడిగారా? అంటే ఒకదాని తరువాత ఒకటిగా ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు మదింపునకు చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే ఔననక తప్పదంటున్నారు పరిశీలకులు.

ఇప్పటికే పలు మార్లు ఆయన పార్టీ నేతల పనితీరుకు కొలమానం గడపగడపకు కార్యక్రమంలో వారి పనితీరేనని చెప్పారు. వారి పని తీరును బట్టే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఉంటుందా.. ఊడుతుందా అన్నది నిర్ణయిస్తాననీ చెప్పారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదనీ అందరినీ ఒకే గాటన కట్టేశాననీ చెప్పారు. ఇప్పుడు ఇక ఆయన మరో అడుగు ముందుకు వేసి పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారు. పెంచారు. ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా ఎమ్మెల్యేలు, మంత్రులు పని తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్న జగన్ ఇప్పుడు వారిపై నిఘా నేత్రాలను సారించారు. పీకే బృందం ఒకవైపు, ఇంటిలిజెన్స్ మరో వైపు ఎమ్మెల్యేలను అడుగడుగునా పరిశీలిస్తున్నారు. గడపగడపలో వారి పెర్ఫార్మెన్స్ పై ఎప్పటికప్పుడు జగన్ కు నవేదికలు ఇస్తున్నారు. ఇప్పటికే అది జరుగుతున్నా.. విశాఖ గర్జన వైఫల్యంతో ఈ నిఘాను మరింత పెంచారు. వచ్చే ఎన్నికలలో ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలి, ఎవరికి మంగళం పాడాలి అన్న విషయంపై ఈ నిఘా నివేదికలనే ఆయన నమ్ముకున్నారు.

దీంతో ప్రతి ఎమ్మెల్యే వెంటా ఒక ఐప్యాక్ ప్రతినిథిని పంపడానికి జగన్ నిర్ణయించుకున్నారు. ఇక ఇంటెలిజెన్స్ నిఘా ఎలాగూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట తిరిగే ఐ ప్యాక్ ప్రతినిథి అనుక్షణం వారి పనితీరును పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు జగన్ కు పంపుతారు. ఆ నివేదికలే సదరు ఎమ్మెల్యే, మంత్రి పని తీరుపై జగన్ ఒక అంచనాకు, తద్వారా ఒక నిర్ణయానికి రావడానికి దోహదపడుతాయి. ఐప్యాక్ ప్రతినిథులు రోజువారీ నివేదికలు, ప్రజలలో ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణ, ప్రజల వద్దకు వెళుతున్నారా? ఆయన ప్రసంగాలలో ప్రభుత్వ పథకాల గురించి సమగ్రంగా వివరిస్తున్నారా? సంక్షేమ పథకాల లబ్ధిని చెబుతున్నారా? గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్నారా..ఇలా ఎమ్మెల్యే తన ఇంటి గడప దాటి గడప గడపకు వెళుతున్నారా లేదా నుంచి.. ప్రతి మాటకూ ముందూ వెనుకా జగన్ సంక్షేమ పథకాలను పొగుడుతున్నారా లేదా అన్న అంశాలపై ఉంటాయి.

ఈ నివేదికలను ఏ రోజుకారోజు వైసీపీ కార్యాలయం విశ్లేషించి వారానికి ఒక సారి ఒక సమగ్ర నివేదికను జగన్ కు అందజేస్తుంది. ఇలా రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 151 నియోజకవర్గాల నుంచీ కూడా జగన్ కు నివేదికలు అందుతాయి. వాటి ఆధారంగా జగన్ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తారు. ఇప్పటికే జగన్ గడప గడపకు వర్క్ షాప్ లో కొందరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరీ వారి పని తీరు బాగాలేదనీ, మార్చుకోకుంటే చర్యలు తప్పవనీ ముఖం మీదే చెప్పేసిన సంగతి తెలిసిందే. అలా జగన్ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా వంటి వారు కూడా ఉన్నారు. ఆ వర్క్ షాపులో పేర్లు చెప్పని వారి పని తీరు బాగుందని కాదని కూడా ఆ సందర్భంలో జగన్ విస్పష్టంగా చెప్పారు. ఇలా ప్రతి క్షణం, ప్రతి రోజూ నిఘా నీడలో పని చేయాల్సి రావడం చాలా ఇబ్బంది అని వైసీపీ ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. ప్రతి క్షణం శీల పరీక్షకు నిలబడి పని చేయడం తమ వల్ల కాదని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. పార్టీ టికెట్ రాకపోతే పోయింది. ప్రతి రోజూ, ప్రతి క్షణం స్కానింగ్ కు నిలబడటం మా వల్ల కాదని కొందరు కాడి వదిలేయడాని కూడా సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి.

ఇప్పటికే జగన్ చాలా దూరం వచ్చేశారనీ, పిల్లినైనా గదిలో తలుపులు మూసి బంధించి బెదరిస్తే తిరగబడుతుందనీ, ప్రజా ప్రతినిథుల మీద జగన్ నిఘా బూమరాంగ్ అయి మొదటికే మోసం వచ్చే పరిస్థితి తప్పదనీ రాజకీయవర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ప్రజా ప్రతినిథుల పని తీరును చెప్పాల్సింది ప్రజలే కానీ.. నిఘా బృందాలు కాదనీ, ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేల సహనాన్ని పరీక్షిస్తున్నారనీ, తెగేదాకా లాగుతున్నారనీ పరిశీలకులే కాదు, పార్టీలోని కొందరు కూడా బాహాటంగానే చెబుతున్నారు. 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.