ఇక ఇప్పుడు నియోజకవర్గ పరిశీలకులు.. జగన్ నిర్ణయంతో ఎమ్మెల్యేలలో గాభరా

Publish Date:Sep 13, 2022

Advertisement

వైసీపీలో రానున్న ఎన్నికలలో విజయంపై రోజు రోజుకూ ఖంగారు పెరిగిపోతోంది. భయం గూడు కట్టుకుంటోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ లో ఈ భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో రోజుకో కొత్త నిర్ణయం, పూటకో కొత్త నియామకం చేపడుతున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే   నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇన్ చార్జిగా ఉన్నారు.ఇప్పుడు   అదనంగా పరిశీలకుడిని నియమించాలని నిర్ణయించారు. ఆ పరిశీలకుల జాబితా ఇప్పటికే ఖరారైందని కూడా పార్టీ వర్గాలుచెబుతున్నాయి. అంటే ఇప్పుడు ఉన్న నియోజకవర్గ ఇన్ చార్జ్ కాకుండా ఒక పరిశీలకుడు కూడా ఉంటారన్న మాట.

జగన్ నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గాభరా పెరిగింది. అయితే ఈ పరిశీలకులు ఏం చేస్తారు, ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏమిటి అన్నది మాత్రం ఇతమిథ్థంగా తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ప్రజలలో అసంతృప్తి తార స్థాయిలో ఉందన్న ఐ ప్యాక్ నివేదిక ఆధారంగా జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

జగన్ ఎన్నో ఆశలు పెట్టుకుని జనాలలోకి పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, తాను బటన్లు నొక్కడం ద్వారా లబ్ధిదారులు పొందిన ప్రయోజనాలను ప్రజలకు వివరించి మరో సారి వైసీపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సోపానంగా మారుతుందని భావించిన గడపగడపకూ కార్యక్రమం దారుణంగా విఫలం అవ్వడమే కాకుండా బూమరాంగ్ అయ్యి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను ఫేస్ చేయలేని పరిస్థితులు ఎదురు కావడంతో ఆయనలో ఖంగారు మొదలైందని పరిశీలకులు అంటున్నారు.  ఆ కారణంగానే పని చేసే వారికే పార్టీ టికెట్లు, విపక్ష విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వని మంత్రులకు ఉద్వాసన అంటూ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

ఇప్పుడు తాజాగా నియోజకవర్గ పరిశీలకులు నియామకానికి సిద్ధం కావడంతో నియోజకర్గాలలో ఇప్పటికే ఉన్న వర్గ విభేదాలతో అయోమయంలో ఉన్న పార్టీ క్యాడర్ మరింత గందరగోళానికి గురి చేసే నిర్ణయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఇప్పుడు నియమితులు కానున్న పరిశీలకులు ఇప్పటికే ఉన్న ఇన్ చార్జీలకు అదనం కావడంతో పరిస్థితి మరింత క్లిష్టం అవుతుందని పార్టీ క్యాడర్ అంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్రతి నియోజకర్గంలోనూ గ్రూపు తగాదాలు ఉన్నాయి. పార్టీ టికెట్ ఆశావహుల సంఖ్యా భారీగానే ఉంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదంటూ జగన్ ఇప్పటికే ప్రకటించడంతో దాదాపు 151 నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యేలలో అభద్రతా భావం నెలకొని ఉంది. ఆ కారణంగానే దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా అధికంగానే ఉంది. ఇప్పుడు పరిశీలకుల నియామకం నిర్ణయంతో గ్రూపులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.

దాదాపుగా అన్ని నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యేనే ఇన్ చార్జిగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం ఉందంటూ జగన్ పరిశీలకుల నియామకానికి తెరతీశారు. అసలు వాస్తవంగా ప్రతి నియోజకవర్గానికి అదనపు ఇన్ చార్జిని అంటే ఎమ్మెల్యేకు పోటీగా ఒకరిని నియమించాలన్నది ఆయన ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  అయితే ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గానికి ఇన్ చార్జిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించడానికి వ్యతిరేకంగా గళమెత్తడం, ఆమె వర్గీయులు ఆందోళనకు దిగడంతో జగన్ వెనక్కు తగ్గారని అంటున్నారు.

అందుకే ఇప్పుడు పరిశీలకుల పేర అదనపు ఇన్ చార్జిలను నియమిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. గతంలోలా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే ధైర్యం జగన్ కోల్పోయారనీ, పార్టీలో అసంతృప్తి, తన నిర్ణయాలను ధిక్కరించి ఆందోళనలకు సైతం దిగుతున్న పరిస్థితులను గమనించి భయపడుతున్నారనీ అంటున్నారు. ఏది ఏమైనా పేరు పరిశీలకుడే అయినా ఆ పరిశీలకుడి పాత్ర మాత్రం అదనపు ఇన్ చార్జి అనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు సహజంగానే పరిశీలకుడికి సహకరించే పరిస్థితి ఉండదని అంటున్నారు. మొత్తంగా ఈ మూడేళ్లలో ఎన్నడూ లేనంత అయోమయ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ, ఆ పార్టీ నేతలు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో జగన్ కు కోపం వస్తుందేమోనని పార్టీ నాయకులు భయపడేవారని ఇప్పుడు నేతలు అసమ్మతి గళం విప్పుతారేమోనని జగన్ భయపడే పరిస్థతి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.