ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై వైసీపీ అధినేత తీరు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా తయారైంది. తాజాగా ఆయన వచ్చే ఎన్నికలకు అంటే 2029 ఎన్నికలకు పార్టీ అజెండాను ప్రకటించేశారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పార్టీ విధానాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, తాను సీఎం అయితే.. మావిగన్ రాజధాని అని ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు మావిగన్ తన నినాదమనీ, అదే తమ పార్టీ అజెండా అనీ చెప్పారు.
అయితే రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. గతంలో 2019 ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు పలికిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్నారు. తీరా ఇప్పుడు ఆ మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కనబెట్టి అకస్మాత్తుగా సరికొత్తగా 'మవిగున్' అంశాన్ని తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తామని 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రచారం చేసింది. అయితే, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు, మరీ ముఖ్యంగా విశాఖ వాసులు ఈ మూడు రాజధానుల ఆలోచనను నిద్వంద్వంగా తిరస్కరించారు. ఇంతటి వైఫల్యం తర్వాత కూడా జగన్ తన పంథాను మార్చుకోకుండా, ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి తెరలేపడం వెనుక ఉన్న వ్యూహం ఎవరిదనే చర్చ నడుస్తోంది. ఎలాంటి ప్రజాదరణ లేదా సెంటిమెంట్ లేని సరికొత్త ప్రతిపాదనను ఎన్నికల అజెండాగా మార్చడం రాజకీయంగా వైసీపీకి, జగన్ కు ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా నిండా ముంచేసే సలహాలు జగన్ కు ఇస్తున్నదెవరా అన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాకుండా వైసీపీలో కూడా విస్తృతంగా జరుగుతున్నది. మావిగన్ రాజధాని అజెండాను ప్రకటించడం ద్వారా జగన్ వచ్చే ఎన్నికలకు మూడేళ్ల ముందే ఓటమికి రెడీ అయిపోయారని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.
అధికార పక్షమైన తెలుగుదేశం కూటమి తొలి నుంచీ అమరావతి ఏకైక రాజధాని అనే స్పష్టమైన, స్థిరమైన స్టాండ్ తో వెడుతుండగా, జగన్ మాత్రం జగన్ మాత్రం ప్రతి ఎన్నికలకూ రాజధాని విషయంలో మాట మారుస్తూ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించిన జగన్.. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మాట మార్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత ఇప్పుడు మూడు రాజధానులను మూటగట్టి పక్కన పడేసి మావిగన్ అంటూ కొత్త రాగం ఆలపించడం ద్వారా తనకు ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ లేదని చాటుకుని ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నారని అంటున్నారు. ఈ తరహా వ్యూహాలు జగన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా, ఆయన నాయకత్వ పటిమపై కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-change-stance-once-again-39-224827.html
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.