బటన్ నొక్కుడుకు ఇక ఫుల్ స్టాపే!?

Publish Date:Feb 15, 2023

Advertisement

జగన్ విశ్వాసం, జగన్ ను నమ్ముకున్న వాళ్ల విశ్వాసం ఒక్కటే.. బటన్ నొక్కుడు కొనసాగినంత కాలం అధికారానికి ఢోకా లేదు. ప్రజలు ఎంతగా వ్యతిరేకించినా, ఆందోళనలతో రాష్ట్రం ఉడుకెత్తిపోయినా, ఏం ఫరక్ పడదు.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ము పడుతున్నంత కాలం ఓట్లెక్కడికీ పోవు. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు పరాభవాలు ఎదురైనా.. స్వయంగా ముఖ్యమంత్రి సభల నుంచే జనం పారిపోయినా.. మంత్రుల సభలకు ప్రజలు మొహం చాటేసినా భయ పడాల్సిన పని లేదు. విపక్షాల సభలకు జనం పోటెత్తి జయజయధ్వనాలు ఆందోళన వద్దు.. ఓట్లూ మనవే, అధికారమూ మనదే.. ఇంత కాలం వైసీపీలో కనిపించిన ధీమా ఇదే.

ఔను జగన్ బటన్ లు నొక్కడమే వైసీపీలో ఓటమి భయం లేకుండా ధీమా కనిపించడానికి కారణం. అయితే ఇప్పుడా ధీమా లేకుండా పోయింది. ఇక జగన్ బటన్ నొక్కుదామన్నా నొక్కలేని పరిస్థితి వచ్చేసింది. ఖజానాలో సొమ్ములు నిండుకున్నాయి. అప్పులు పట్టే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇకపై రోజు గడవడమే ప్రభుత్వానికి గగనం అన్న పరిస్థితి వచ్చేసింది. ఉద్యోగుల జీతాలకే దిక్కు దివాణం లేని ఆర్థిక అధోగతికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. ఇంత కాలం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జనం ఛీత్కారాలు చేస్తున్నా ఎమ్మెల్యేలు భరించి ఏదో విధంగా ఆ కార్యక్రమాన్ని మమ అనిపించేందుకు ప్రయత్నమేనా చేసే వారు. ఎందుకంటే జగన్ బటన్ నొక్కుతున్నారు కనుక ఈ ఛీత్కారాలు ఓట్లపై పెద్దగా ప్రభావం చూపవని ఏమూలో ఒకింత ఆశ ఉండేది వారిలో.

ఇప్పుడా ఆశా అడుగంటి పోయింది.  ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం కారణంగా నిధులు నిండుకుని, అప్పులుపుట్టని పరిస్థితి ఏర్పడి జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమం ఇంచుమించుగా ఆగిపోయింది.   అందుకే జగన్ లో కూడా ధీమా కనిపించడం లేదు. గతంలో మీరు జనంలో తిరగండి.. నేను బటన్లు నొక్కి జనాల ఖాతాలలో సొమ్ము జమ చేస్తా.. విజయానికి ఢోకా ఉండదు.. మామూలు విజయం కాదు.. 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ మనమే గెలుస్తాం అని ధీమాగా చెప్పే వారు. కానీ ఆయనకు ఇప్పుడా ఆస్కారం లేకుండా పోయింది.  ఆయనే స్వయంగా విడుదల చేసిన క్యాలండర్ ప్రకారం బటన్ నొక్కడానికి అవకాశం లేని పరిస్థితిని ఇప్పుడాయన ఎదుర్కొంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు.  

ఉదాహరణకు ఆసరా పథకాన్నే తీసుకుంటే.. రమారమి కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ  ఇప్పుడు అతీగతీ లేకుండా పోయింది.  ఈ పథకం కింద నాలుగేళ్లపాటు రూ. 12500 బటన్ నొక్కుడు ద్వారా అందజేస్తామని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ క్యాలెండ్‌లో ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలలో జనవరిలో సొమ్ములు జమ కావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి నెల సగం గడిచిపోయినా ఇంకా జగన్ బటన్ నొక్కి ఆసరా పథకం లబ్థిదారులకు సొమ్ములు జమ చేయలేదు.  అంతకంటే ముందు డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలకు బటన్లు నొక్కాలి. వాటి సంగతి అతీగతీ లేదు. ఇక ఇప్పుడు ఇక ఫిబ్రవరి నెలలో  విద్యా దీవెన పథకానికి  బటన్ నొక్కాలి. దానిపైనా జగన్ సర్కార్ కిమ్మనడం లేదు.   పథకాల సంగతి పక్కన పెడితే  జీతాలు, పెన్షన్లకే జగన్ సర్కార్ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి.  

అదనపు రుణాల కోసం ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. దీంతో మార్చి నెల వస్తేం ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం అయోమయం నెలకొంది.  ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకుల్లోనూ, శ్రేణుల్లోనూ కూడా జగన్ పై విశ్వాసం సన్నగిల్లింది, భవిష్యత్ పై భరోసా కరవైంది. అందుకే పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. తీవ్రమౌతున్నాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.