జగన్ కడప కోటకు బీటలు?!

Publish Date:May 26, 2023

Advertisement

ఇంత కాలం వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న కడపలో ఆ కుటుంబ ఆధిపత్యం బీటలు వారుతోందా? పులివెందులలో జగన్ ఆధిపత్యానికి గండి పడుతోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ బతికి ఉన్నంత కాలం ఆ కుటుంబం పులివెందులలోనే కాదు.. కడప జిల్లాలోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. వైఎస్ బతికి ఉండగా ఆయన కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉండేది.  

ఆయన మరణించి 13 సంవత్సరాలు అయ్యింది.  ఆయన మరణం తరువాత వైఎస్ జగన్ ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. అయితే ఆయన కాంగ్రస్ ను వీడి వైసీపీ పేర సొంత కుంపటి పెట్టుకున్నారు.  ఏపీలో అధికార పగ్గాలు కూడా అందుకున్నారు. అయితే ఆయన అధికార పగ్గాలు అందుకున్న తరువాత  ఆయన తీరు, అలాగే వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న తీరు వైఎస్ కుటుంబంలో నిలువునా చీలిక వచ్చింది.  ఇదే కుటుంబం వైఎస్ కుమారుడు, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ గతంలో విపక్షంలో ఉన్న సమయంలో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సందర్భంలో ఆయనకు అండగా నిలబడింది. ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. జగన్ జైలుకు వెళ్లడంతో మధ్యలో ఆగిపోయిన జగన్ పాదయాత్రను ఆయన సోదరి షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కొనసాగించారు.  

అయితే జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్లు కాకుండానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  కుటుంబాన్ని నిచ్చెనగా చేసుకుని, ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న జగన్ రెడ్డి ఆ తరువాత క్రమంగా కుటుంబాన్ని దూరం పెడుతూ వచ్చారు.  సొంత తల్లి  చెల్లి కూడా దూరమయ్యారు. చెల్లి షర్మిల అయితే  తెలంగాణకు వలస వెళ్లి తన తండ్రి పేర రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పలు సందర్భాలలో ఆమె సొంత అన్న జగన్ పైనే విమర్శలు గుప్పించారు. తల్లి విజయమ్మ జగన్ కు దూరంగా కుమార్తెతోనే ఉంటున్నారు. జగన్ వైఎస్ ఫ్యామిలీకి  దూరమయ్యారని విశ్లేషకులు అంటున్నారు.  

ఇక జగన్ సొంత బాబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో తొలుత అంటూ అధికారంలోకి రాకముందు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్.. ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ దర్యాప్తు వద్దనడంతో వివేకా కుమార్తె సునీత జగన్ కు ఎదురు తిరిగారు. సుప్రీం కు వెళ్లి మరీ సీబీఐ దర్యాప్తును సాధించుకున్నారు. ఆ తరువాత ఏపీలో దర్యాప్తు సవ్యంగా జరిగే అవకాశం లేదంటూ విచారణను సుప్రీంను ఆశ్రయించి విచారణను ఏపీ నుంచి తెలంగాణకు మార్పించుకున్నారు.

 ఇక వివేకా హత్య కేసు దర్యాప్తు లాజికల్ ఎండ్ దిశగా సాగుతున్న కొద్దీ  వైఎస్ కుటుంబ కలహాలు  ముదురు పాకాన పడుతున్నాయి. గత ఏడాది జులై 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా ఆనవాయితీకి భిన్నంగా, తల్లి, కొడుకు, అక్కా,చెల్లి ఎవరికి  వారుగా ఇడుపులపాయలోని  వైఎస్ సమాధి వద్ద ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు. ఒకరికి ఒకరు తారసపడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.   ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో జగన్ ఏకాకిగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితే కడప జిల్లాలో జగన్ కోటకు బీటలు వారేలా చేసిందని అంటున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.