వైఎస్ జగన్.. పరామర్శల్లేవు.. పెళ్లిళ్లకు హాజర్లే!

Publish Date:Mar 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం అంతా చాలా బిజీబిజీగా గడపనున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ పాల మరణాలు, బాణాసంచా పేలుడు ఘటన కారణంగా జరిగిన మరణాలు ఉన్నా.. జగన్ ఆయా సంఘటన బాధితులను పరామర్శించే పని పెట్టుకోలేదు. ఈ వారంలో ఆయన షెడ్యూల్ లో పెళ్లి వేడుకలకు హాజరు కావడం మాత్రమే ఉంది.  తొలుత ఆయన సోమవారం కల్తీ పాల మృతుల కుటుంబాలను పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు చెప్పాయి.

అయితే సోమవారం వచ్చింది. వెళ్లింది. కానీ జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ దాటి అడుగు బయటపెట్టలేదు.  మంగళవారం (ఫిబ్రవరి 3)ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. ఆ సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క్ తాడేపల్లి ప్యాలెస్ ను విజిట్ చేసి తన కుమారుడి పెళ్లికి జగన్ ను ఆహ్వానించి, ఆహ్వానపత్రిక ఇచ్చారు. వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి  వివాహానికి బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు. దీంతో అంతకు ముందు రోజే అమరావతిలో చంద్రబాబును కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన భట్టి, మరో సారి ఏపీకి వచ్చి జగన్ ను ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. 

సరే జగన్ భట్టి అందించిన ఆహ్వాన పత్రికను అందుకోవడం వినా మంగళవారం (మార్చి 3) మరో కార్యక్రమం పెట్టుకోలేదు. ఇక బుధవారం (మార్చి 4) జగన్ అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరయ్యారు. , ఆ తరువాత విశాఖ లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లారు. ఇటీవల వాసుపల్లి గణేష్ కుమారుడి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.  వాసుపల్లి నివాసానికి వెళ్లిన జగన్  నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రెండు సందర్భాలలోనూ జగన్ భారీ జనసమీకరణ జరిగేలా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు.  తాడేపల్లికి తిరిగి వచ్చారు. సాధారణంగా జగన్ తన రెండుమూడు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనల్లో పరామర్శ యాత్రలకూ, తన నివసంలో ఏర్పాటు చేసే మీడియా సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ వారం మాత్రం ఆయన ఆనవాయితీని కాదని.. ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి, మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఆశీర్వదించి రావడానికే పరిమితమయ్యారు. 

మండలిలో లడ్డూ వివాదంపై రభస జరుగుతున్నా దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. రాజమహేంద్రవరంలో ఇటీవల కల్తీ పాలు కారణంగా మరణాలు సంభవించినా, కాకినాడ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడులో పలువురు మరణించినా.. ఆయా ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించాలని కూడా భావించలేదు.   

By
en-us Political News

  
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.