ఏపీ నీది.. తెలంగాణ నాది.. జగన్, షర్మిల వ్యూహం?

Publish Date:Jun 24, 2023

Advertisement

పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడే అన్నది నానుడి. రాజకీయాలలో కూడా సాధారణంగా అదే పరిస్థితి ఉంటుంది. రాజకీయం కోసం అన్నా తమ్ముళ్లు, అక్కా చెళ్లెల్లు, భార్యాభర్తలు పోటీ పడటం కామనే. కానీ వైసీపీ కుటుంబంలో మాత్రం ఆ పోటీ పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నతో తగాదాలు (అవి ఆస్తితగాదాలని పెద్దగా ప్రచారంలో ఉంది) కారణంగా ఏపీ సీఎం వైస్ జగన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పుట్టిల్లు వదిలేసి అంటే ఏపీని వదిలేసి మెట్టినిల్లంటూ తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు.

ఆమె వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, వారానికో దీక్ష చేసినా, తెలంగాణలో అధికార పార్టీ, ఆ పార్టీ అధినేత, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించినా, ఉద్రిక్తతలను పెచ్చరిల్లేలా విమర్శలు చేసి, ధర్నాలు చేసి అరెస్టైనా ఆమెకు కానీ, ఆమె వైఎస్సార్టీపీ కి కానీ పెద్దగా  మైలేజీ రాలేదు. దీంతో ఆమె చూపు తండ్రి జీవించి ఉన్నంత కాలం కొనసాగిన కాంగ్రెస్ పార్టీపై పడింది. స్వయంగా ఆమె బెంగళూరు వెళ్లి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో వరుస భేటీల ద్వారా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా అన్న ఊహాగానాలకు తావిచ్చారు. అక్కడ నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది, ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టి అన్న, ఏపీ సీఎం జగన్ కు పక్కలో బల్లెంగా మారతారన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అవి పీక్స్ కు చేరేదాకా వేచి చూసిన షర్మిల విలీనం ప్రశక్తే లేదని మెల్లిగా, తన ఆశ, శ్వాస తెలంగాణయే అంటూ గట్టిగా ప్రకటించారు.

ఆమె ఎంతగా విలీనం లేదు మొర్రో అని మొరపెట్టుకుంటున్నా.. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం వార్తలు మాత్రం ఆగడం లేదు. ఆమె తన పార్టీపై పెట్టిన కాన్సన్ ట్రేషన్ ను తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన, ఆయన కుటుంబ అక్రమాలపై పెట్టండంటూ మీడియాకు హితవు పలికినా.. ఆమె వరుస భేటీలూ, ఆమె తండ్రి కుటుంబానికి సన్నిహితుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రినివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోవడం.. ఇటీవలి కాలంలో పొంగులేటి అటు జగన్ తోనూ, ఇటు షర్మిలతోనూ భేటీ కావడం వీటన్నిటినీ చూస్తుంటే.. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో ఆమె తన సోదరుడి విజయం కోసం కృషి చేసినట్లే..  వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణకే పరిమితం కావడం ద్వారా మరోసారి జగన్ కు ఆమె అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. అయితే షర్మిలను కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ ను చేస్తుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.   తాను ఏపీకి వెళ్లేది లేదని.. తెలంగాణ బిడ్డడా.. తుది శ్వాస వరకూ తెలంగాణలో రాజకీయం చేస్తానని కొట్లాడుతానని విస్పష్టంగా చెప్పేయడం ద్వారా ఆమె ఏపీలో జగన్ కు ఇసుమంతైనా నష్టం చేయడానికి రెడీగా లేరన్నది తేటతెల్లం చేశారు.  

డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సహా తెలంగాణ సీనియర్లు  ఆమె తెలంగాణలో అవసరం లేదని.. ఆమె పార్టీ విలీనానికి ఓకే కానీ ఆమె అవసరం తెలంగాణలో లేదనీ, ఏపీలోనే ఉందని అంటున్నారు. ఆ దిశగా ఆమెను ఒప్పించేందుకు శతథీ ప్రయత్నిస్తున్నారు. కానీ నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం షర్మిలను  తెలంగాణ రాజకీయాల్లోనే  కొనసాగాలని పార్టీ నాయకులకు గట్టిగా చెబుతున్నారు.  విలీనానికి ఓకే కానీ..ఏపీకి వెళ్లనని షర్మిల అంటున్నారు. అయితే షర్మిల విలీనానికి మెగ్గు చూపుతూనే ఏపీకి దూరం అనడం వెనుక  అన్నాచెల్లెళ్ల వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిలను ఎలాగైనా ఒప్పించి   ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. ఏం జరుగుతుందన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.