జగన్ 2.0 సూపర్‌యాప్‌ ఆవిష్కరణ..!

Publish Date:Jul 16, 2026

Advertisement

 

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత  జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సాంకేతికంగా మరింత చేరువయ్యే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్న కంటెంట్‌ను ఇష్టానుసారంగా తొలగించడం, కుట్రపూరితంగా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి సొంత డిజిటల్ ప్లాట్‌ఫామ్ అవసరమని భావించి ‘జగన్ 2.0 సూపర్‌యాప్‌’ను రూపొందించినట్లు చెప్పారు.

"ఈ యాప్‌లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఇది మన పార్టీకి చెందిన సొంత వేదిక కావడంతో బయటి వ్యక్తులు లేదా ఇతర సంస్థలు కంటెంట్‌ను తొలగించే అవకాశం ఉండదు. దీంతో కార్యకర్తల గొంతును అణిచివేసే కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు" అని జగన్ పేర్కొన్నారు.
పార్టీలోని గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు అందరూ ఈ యాప్ ద్వారా పరస్పరం అనుసంధానమై ఉంటారని తెలిపారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు.

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసు వేధింపులు, రాజకీయ పరమైన అంశాలు వంటి వాటిని నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఎప్పటికప్పుడు పరస్పరం టచ్‌లో ఉండేలా ఈ వేదిక పనిచేస్తుందని వెల్లడించారు.

పార్టీ నిర్వహించే సమావేశాలు, ప్రెస్‌మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్ ఫీడ్ రూపంలో అందుబాటులో ఉంటాయని జగన్ తెలిపారు. భవిష్యత్తులో కార్యకర్తల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఫీచర్లను జోడించి యాప్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాటిని యాప్‌లో నమోదు చేయవచ్చని, ఆ సమాచారంపై పార్టీ వెంటనే స్పందించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధితులకు అండగా నిలిచే అవకాశం ఈ యాప్ ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు.

రాజకీయ వేధింపులు, పోలీసు వేధింపులకు గురవుతున్న పార్టీ కార్యకర్తల కోసం ఇప్పటికే నిర్వహిస్తున్న డిజిటల్ డైరీని కూడా ఈ సూపర్‌యాప్‌తో అనుసంధానం చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. దీంతో బాధితులు నేరుగా యాప్ ద్వారానే తమ ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

నమోదు చేసిన వివరాలు పార్టీ నాయకత్వానికి చేరి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో పార్టీపై జరుగుతున్న అనుచిత ప్రచారం, విమర్శలు, వీడియోలు, పోస్టులపై ఫిర్యాదులు చేసి వాటిని తొలగించే చర్యలు కొనసాగుతూనే, మరోవైపు ఎవరూ అడ్డుకోలేని సొంత డిజిటల్ వేదికను రూపొందించుకున్నామని జగన్ పేర్కొన్నారు.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.