రోజా ఫైర్ కు కారణం అదేనా?

Publish Date:Sep 19, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గంలో అస్సలు పరిచమే అవసరం లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే, ఆ మంత్రి ..పేరు ..ఆర్కే రోజా... నిజమే మళ్ళీ ఆర్కే.. అంటే కొందరికైనా,  ఎవరామె?  అనే అనుమానం వస్తే రావచ్చును. కానీ, జబర్దస్త్ రోజా అన్నారనుకోండి, పిల్లా పాపా, గొడ్డు గోదా సహా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. ఠక్కున అర్థమైపోతుంది. ఆమె వందకు పైగా సినిమాల్లో నటించారు, రాజకీయాల్లోనూ చాలా కాలంగానే ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు,. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.అయినా, రోజా అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే రోజా .. అనేలా పాపులర్ అయ్యారు. అందుకే, రోజా అనగానే ముందు ఆమె జబర్దస్త్ నవ్వు ఆ వెనకనే ఆమె అందమైన రూపం కళ్ళ ముందు కొచ్చేస్తాయి. 

అవును రోజా, బహుముఖ ప్రజ్ఞావంతురాలు. హీరొయిన్ గా, నటిగా, యాంకర్ గా,అనేక రంగాలలో తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. ఇవన్నీ ఒకెత్తు అయితే,  అన్నింటినీ  మించి శ్రీమతి రోజా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పై ఈగ వాలినా సహించలేరు. జగనన్న అంటే రోజాకు అంత ఇదన్న మాట. జగనన్నకు కూడా అంతే సొంత సోదరి షర్మిలమ్మ కంటే దేవుడిచ్చిన చెల్లెలు రోజా అంటే ఎక్కువ ప్రేమ. అందుకే మంత్రి పదవి కోసం ఆమె పడ్డ తపనను చూసి తట్టుకోలేక, ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అందుకే ఆమె, రెట్టించిన ఉత్సాహంతో, జగనన్నను ఎవరన్నా ఏదన్నా అంటే, మరింతగా రెచ్చిపోతున్నారు. 

ఇంతవరకు తెలుగు దేశం నాయకుల మీద నోరు పారేసుకున్న రోజా, ఇప్పడు జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన నేరం ఏమిటంటే, ఎవరో చేసిన ఏదో సర్వే ఆధారంగా నెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపే ఓడి పోతుందని, ఆపార్టీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. నిజానికి, అంత మాత్రానికే, రోజా మేడం అంతలా అగ్గిమీద గుగ్గిలం ఎందుకయ్యారో ఆమెకే తెలియాలని ఆమె అనుచరులే అంటున్నారు. 

అయితే, ఆమె ఇలా రెచ్చి పోవడానికి ఇంకా ఎదో కారణం ఉందని,ఆమె కుర్చీ కిందకు నీళ్ళొచ్చాయని, అందుకే ఆమే జగనన్నను ప్రసన్నం చేసుకునేందుకే, ఎగస్ట్రా జబర్దస్త్ స్టైల్లో ఎగస్ట్రా ‘డైలాగ్స్’ తో విరుచుకు పడుతున్నారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇచ్చిన కిక్కులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులకు గట్టిగా క్లాసు పీకారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డితో పాటుగా, ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి ప్రమేయం ఉందని విపక్షాలు ఆరోపించాయి. అయినా, ఆ ఆరోపణను మంత్రులు ఎవరూ ఖండించలేదు. మంత్రులకు ఏ నిజాలు తెలుసో ఏమో  కానీ, ఎవరికి వారు, మన కెందు కొచ్చిందిలే అని మౌనంగా ఉండి పోయారు.

సహజంగానే, ముఖ్యమంత్రికి కోపమొచ్చింది.మీకు మంత్రి పదవులు ఇచ్చింది ఎందుకు ఇందుకే కదా, నామీద, నా కుటుంబ సభ్యులపై ఇంతలేసి ఆరోపణస్తే ఖండించవలసిన బాధ్యత మీకు లేదా అంటూ మంత్రులపై మండి పడ్డారు. ఇలా అయితే లాభం లేదు,  మీ దారి మీది నా దారి నాదని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇద్దరు మహిళా మంత్రులతో పాటుగా, మొత్తం నలుగురు మంత్రులకు ఉద్వాసన తపదని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.  ఆ నలుగురిలో ఫస్ట్ నేమ్. ఆర్కే రోజాదే అని పార్టీ వర్గాలే చెప్పాయి. అందుకే, ఇప్పుడు ఆమె, జబర్దస్త్ నుంచి ఎగస్ట్రా జబర్దస్త్  మించి మరింత రెచ్చి పోతున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.