Publish Date:Nov 29, 2024
లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ కోసం తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయసేకరణ వివాదాస్పదం కావడంతో జాతీయ రహదారుల కోసం భూసేకరణ సరిగ్గా జరగడం లేదని తెలుస్తోంది. అవార్డ్ పాస్ అయిన భూములకు ఇంత వరకు నష్ట పరిహారం అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అడ్వాన్స్ ఇవ్వకుండానే భూసేకరణ చేపడుతున్న అధికారులకు రైతులు సహకరించడం లేదు. దీంతో రేవంత్ సర్కార్ కు విషయం అర్థమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన లగచర్లను సాకుగా చేసుకుని రైతులు భూసేకరణకు ముందుకు రావడం లేదు. దీంతో లగచర్ల భూసేకరణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. రైతుల నుంచి అడుగడుగునా వ్యతిరేకత రావడంతో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. భూసేకరణ చేసే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ ఏ ఐ) ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో రైతులు భూసేకరణకు సహకరించకపోతే జాతీయ ప్రాధికార సంస్థ కు ఎలా సహకరిస్తారని రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డికి సూటిగా ప్రాధికార సంస్థ ప్రశ్నించింది. రైతులకు అడ్వాన్స్ ఇవ్వకుండా భూములు ఇవ్వరని కోమటిరెడ్డి తేల్చేసి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
రీజినల్ రింగ్ రోడ్డుకోసం ఇప్పటికే 95 శాతం భూములను ప్రాధికార సంస్థ సేకరించింది. మిగతా ఐదు శాతం భూములను సేకరించిన తర్వాతే అవార్డ్ పాస్ అయిన భూములకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రాధికారసంస్థ నిర్ణయించినట్టు కనబడుతోంది. శుక్రవారం లగచర్ల భూసేకరణ నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి ఇదే కారణమని తెలుస్తోంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-lagacharla-blocking-national-highways-25-189208.html
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.