జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే టార్గెట్‌తో టీఆర్ఎస్ పార్టీని కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇటీవలి కాలంలో ఆయన మౌనంపై రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల సీఎంలంతా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సమావేశం అయ్యేందుకు సన్నద్ధమౌతుంటే.. అసలు మోడీ వ్యతిరేకతే పునాదిగా జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.
వాస్తవానికి ఇలాంటి సమావేశాన్ని కేసీఆర్ ముందుండి నిర్వహించాలి. కానీ అందుకు భిన్నంగా అసలు ఆయన హాజరవుతారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ది వ్యూహాత్మక మౌనం అంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటే.. పరిశీలకులు మాత్రం వేరే విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. అవకాశం లేకపోయినా అవకాశాన్ని సృష్టించుకుని మరీ బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా విమర్శల తుటాలు కురిపించే కేసీఆర్ ఇటీవలి కాలంలో అసలు ఆ దిశగా గొంతు కూడా సవరించుకోవడం లేదు. ఏవైనా సభలూ సమావేశాలలో మాట్లాడినా, ఆయన విమర్శలన్నీ కాంగ్రెస్ పైనే ఉంటున్నాయి కానీ బీజేపీ ఊసు కానీ, ప్రధాని మోడీ మాట కానీ ఎత్తడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయానికి ఎంతో కీలకం అయినటువంటి కర్నాటక ఎన్నికలలో ఆయన కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని అంతా భావించినప్పటికీ అసలా వైపునకే కన్నెత్తి చూడలేదు.
రెండువేల నోట్ల రద్దు సందర్భంగానూ, కేజ్రీవాల్ స్వయంగా వచ్చి మద్దతు కోరినా ఆచితూచి స్పందించడం ద్వారానూ అసలు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా? లేక మద్దతు పలుకుతున్నారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమంటూ జరిగిన ప్రచారం ఇప్పుడు జరగడం లేదు. అసలా కేసులో ఆమె ఆరోపణలు నిజంగా ఎదుర్కొన్నారా అన్నట్లుగా సీబీఐ, ఈడీలు మౌనం వహించాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మౌనం వెనుక ఆయన బీజేపీకి సరెండర్ అయ్యారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద పార్టీ పేరు నుంచి తనకు అచ్చివచ్చిన తెలంగాణ పదాన్ని సైతం తొలగించి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సిద్ధమైన కేసీఆర్ ఇప్పటికిప్పుడైతే దేశ రాజకీయాల్లో ఏకాకిగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా కేసీఆర్ ఏ వేదిక మీద నుంచి మాట్లాడినా ఆ ప్రసంగ లక్ష్యం మాత్రం బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్ గానే ఉండేది.
తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని హెచ్చరించే వారు. అటువంటిది ఇటీవలి కాలంలో ఆయన బీజేపీని కానీ, ప్రధాని మోడీని కానీ పల్లెత్తు మాట అనడం లేదు. చివరాఖరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ఆయన ప్రసంగంలో కూడా జాతీయ అంశాలను ప్రస్తావించలేదు. దీంతో ఆయన బీజేపీకి అనుకూలంగా.. స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లోనే వ్యక్తమౌతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-kcr-silence-strategic-39-156389.html
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.