సిద్ధాంతాలను పక్కన పెట్టేసి బలోపేతం పేరుతో వాపును పెంచేసుకున్న బీజేపీకి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ తొలి నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న పాత నాయకులకు.. చేరికల పేరిట వచ్చి చేరిన నేతలకు అస్సలు పొసగడం లేదు. దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది.
బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్టీలోకి చేరికలు ప్రోత్సహించడానికి ఏకంగా చేరికల కమిటీనే ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇన్ చార్జిగా బయట నుంచి వచ్చి చేరినఈటలను నియమించారు. అసలు బీజేపీలో చేరిన నాటి నుంచీ ఈటలకు పార్టీలో ఉక్కపోత మొదలైందన్న వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా సర్దుకుంటూ, సరిపెట్టుకుంటూ వచ్చిన ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాత్రం సమన్వయం కుదరడం లేదని అంటున్నారు. ఈ తరుణంలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు అంటూ వార్తలు వస్తున్నాయి. తెరాస నుంచి బహిష్కృతులైనప్పటి నుంచీ కమలం గూటిగా, హస్తం గూటికా అని తేల్చుకోలేక సతమతమౌతూ వస్తున్న పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖరారైపోయింది.
వారలా ఖరారు చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు ఈటల వారితో రహస్య భేటీ కావడం.. ఆ భేటీ తరువాత ఈటల స్వయంగా పొంగులేటి, జూపల్లిలు బీజేపీలో చేరే అవకాశం లేదని ప్రకటించడం, అంతటితో ఊరుకోకుండా వారే తనకు బ్రెయిన్ వాష్ చేశారని చెప్పడంతో ఈటల కూడా జంపై పోతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అసలు ఈటల తెరాస నుంచి బయటకు వచ్చేసిన తరువాత.. ఆయనంతట ఆయన రాలేదనుకోండి.. కేసీఆర్ బయటకు పంపారు అది వేరే విషయం. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్ కాషాయ శిబిరంలో ఇమడగలరా అన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్త మయ్యాయి. సరే ఆయన బీజేపీలో చేరడమే కాదు.. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రంగంలో నిలిచి భారీ మెజారిటీతో గెలిచారు.
అయితే ఆ విజయం పూర్తిగా ఈటల వ్యక్తిగత విజయంగా అప్పట్లో పరిశీలకులు అభివర్ణించారు. అయితే ఎలా గెలిచినా ఆ స్థానం బీజేపీ ఖాతాలోనే పడింది అది వేరే సంగతి. ఆ విజయంతో రాష్ట్రంలో ఈటల ఎంత ప్రభావం చూపగలరో బీజేపీ హై కమాండ్ కు బాగా అర్ధమైంది. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయనకు పొసగకపోయినా.. విభేదాలు పలుమార్లు రచ్చకెక్కినా.. ఈటల ప్రాధాన్యత బీజేపీల ఇసుమంతైనా తగ్గలేదు. అయితే అప్పటి నుంచీ కూడా బండి, ఈటల మధ్య సమన్వయం కుదిర్చే విషయంలో బీజేపీ హై క మాండ్ మల్లగుల్లాలు పడుతూనే ఉంది.
బండి సంజయ్ ను మార్చాల్సిందేనని బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన నేతలు గట్టిగా పట్టుబడుతుండటంతో బీజేపీ అగ్రనాయత్వం దిక్కు తోచని స్థితిలో ఉంది. ఎవరిపైనైనా చర్య తీసుకుంటే.. కర్నాటక ఎన్నికల ముందు రాలినట్లు తెలంగాణ కమలంలో కూడా చాలా రేకలు రాలిపోతాయన్న భయం వారిని పట్టి పీడిస్తోంది. అందుకే మరోసారి ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకుంది. మరి ఈ సారి ఈటలను ఎలా సముదాయిస్తారో చూడాల్సి ఉంది. మొత్తం మీద గెలుపు ధీమా బీజేపీలో సన్నగిల్లిందనడానికి ఇటీవలి పరిణామాలు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-joinings-strength-to-bjp-39-156604.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.